'ఆర్కే మీడియా - ఇండియన్ ఫుడ్ ట్రక్ ఫెస్టివల్'
- March 29, 2018
హైదరాబాద్:ఆర్కే మీడియా, 'ది ఇండియన్ ఫుడ్ ట్రక్ ఫెస్టివల్ 2018'ని హైద్రాబాద్‌లో నిర్వహిస్తోంది. హైద్రాబాద్‌లోని పీపుల్స్ ప్లాజా ప్రాంతంలో ఈ ఎగ్జిబిషన్ ఏప్రిల్ 21, 22 తేదీల్లో జరుగుతుంది. 29 ఫుడ్ ట్రక్స్ ఈ ఫెస్టివల్‌లో పాల్గొంటున్నాయి. 200కి పైగా ఇండియన్ కజిన్స్, భోజన ప్రియుల చవులూరించనున్నాయి. 58 మందికి పైగా ప్రముఖ ఛెఫ్‌లు, తమ పాక శాస్త్ర ప్రావీణ్యాన్ని ఇక్కడ ప్రదర్శించబోతున్నారు. లైవ్ మ్యూజిక్, కిడ్స్ జోన్, ఎంటర్‌టైన్‌మెంట్, సెలబ్రిటీ గెస్ట్స్ ఇక్కడ ఇతర ప్రధాన ఆకర్షణలు. ఆర్కే మీడియా అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోన్న ఈ ఫుడ్ ఫెస్టివల్‌లో దేశంలోని 29 రాష్ట్రాలకు చెందిన ప్రత్యేక వంటకాలు కొలువు దీరనున్నాయి. దేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మకం అనదగ్గ స్థాయిలో ఈ ఫుడ్ ఫెస్టివల్‌ని నిర్వాహకులు ఏర్పాట్లు చేస్తున్నారు. దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన ప్రత్యేక వంటకాలకు ప్రాచుర్యం కల్పించడం, అలాగే హాస్పిటాలిటీ రంగానికి సంబంధించి ప్రమోషనల్ ఈవెంట్‌గా దీన్ని మలచడం వంటివి ఈ ఈవెంట్ లక్ష్యాలని నిర్వహకులు తెలిపారు. భోజన ప్రియులే కాక, దేశంలోని వివిధ సంస్కృతీ సంప్రదాయాల పట్ల ఆసక్తి వున్నవారూ ఈ ఈవెంట్‌లో పాల్గొని, ప్రత్యేకమైన వంటకాల రుచుల్ని తెలుసుకోవాల్సిందిగా నిర్వాహకులు విజ్ఞప్తి చేస్తున్నారు.
తాజా వార్తలు
- RBVRR పోలీస్ అకాడమీలో ప్రొబేషనరీ డిప్యూటీ సూపరింటెండెంట్స్ శిక్షణ ప్రారంభం
- 80వేల వీసాలను రద్దు చేసిన డొనాల్డ్ ట్రంప్
- వర్జీనియా లెఫ్టినెంట్ గవర్నర్గా ఎన్నికైన తొలి భారతీయ ముస్లిం మహిళ
- ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ముఖ్య గమనిక..
- WPL 2026 రిటెన్షన్ లిస్ట్ ఇదే..
- టీ20 ప్రపంచకప్ ఫైనల్కు వేదిక ఖరారు..!
- తెలంగాణలో కొత్తగా మూడు టీటీడీ దేవాలయాలు: టీటీడీ ఛైర్మన్
- స్పీడ్మాక్స్ సైకిళ్లను కొనవద్దు..CPA హెచ్చరిక..!!
- దుబాయ్ లో త్వరలో కొత్త వాటర్పార్క్..!!
- బహ్రెయిన్ లో ముగిసిన కొత్త సీజన్ కు రిజిస్ట్రేషన్లు..!!







