‘ఎన్టీఆర్’ బయోపిక్ ప్రారంభం!
- March 28, 2018
నాచారం: విశ్వవిఖ్యాత నటసార్వభౌముడు నందమూరి తారకరామారావు జీవిత విశేషాలతో తెరకెక్కనున్న ‘ఎన్టీఆర్’ చిత్ర షూటింగ్ ఈరోజు ప్రారంభమైంది. నాచారంలోని రామకృష్ణ హార్టికల్చరల్ సినీ స్టూడియోలో ఈ కార్యక్రమాన్ని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు జ్యోతి ప్రజ్వలన చేశారు. ఈ సినిమాకు తేజ దర్శకత్వం వహిస్తున్నారు. ఎన్టీఆర్ పాత్రలో ఆయన కుమారుడు బాలకృష్ణ నటిస్తున్నారు.
ఈ కార్యక్రమానికి బాలకృష్ణ దుర్యోధనుడి అవతారంలో వచ్చి అందరినీ సర్‌ప్రైజ్ చేశారు. ఈ వేడుకకు నందమూరి కుటుంబసభ్యులు, సినీ ప్రముఖులు పెద్దసంఖ్యలో హాజరైన నేపథ్యంలో పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. స్టూడియోలో ప్రధాన ద్వారం నుంచి చలువ పందిళ్లను ఏర్పాటు చేశారు. శ్రీకృష్ణుడి వేషధారణలోని ఎన్టీఆర్ భారీ కటౌట్ ఆకట్టుకుంటోంది. బ్రహ్మతేజ ప్రొడక్షన్స్ పేరుతో నిర్మాణ సంస్థని ప్రారంభించి, బాలకృష్ణ స్వయంగా ఈ చిత్ర నిర్మాణంలో భాగం పంచుకొంటున్నారు. బాలకృష్ణ తన కూతుళ్లైన బ్రాహ్మణి, తేజస్విని పేర్లతో నిర్మాణ సంస్థని ప్రారంభించడం విశేషం. నటీనటులు ఎంపిక ప్రక్రియ దాదాపుగా పూర్తయింది. ఈ చిత్రంలో ఎన్టీఆర్ పాత్రతో పాటు, ఆయన అర్థాంగి బసవతారకం పాత్ర అత్యంత కీలకం. ఆ పాత్ర కోసం పలువురు కథానాయికల పేర్లు ప్రచారంలోకి వచ్చాయి. బాలీవుడ్ భామ విద్యాబాలన్‌ని సంప్రదించగా, ఆమె కొన్ని షరతులతో పాత్ర చేయడానికి అంగీకారం తెలిపినట్టు సమాచారం. తాను చేయబోయే బసవతారకం పాత్ర విషయంలో కొన్ని మార్పు చేర్పులు చెప్పారని, అవి సమ్మతంగానే అనిపించడంతో చిత్రబృందం కూడా అంగీకరించిందని ప్రచారం సాగుతోంది. మరి విద్యాబాలన్ సినిమాలో పక్కాగా నటిస్తున్నారా లేదా అన్నది మాత్రం త్వరలోనే తెలియనుంది.
తాజా వార్తలు
- యూఏఈ పై భారత్ ఘన విజయం
- EOగా సింఘాల్..టిటిడిలో మలివిడత ప్రక్షాళనకు శ్రీకారం
- భారత్పై విరుచుకుపడుతున్న ట్రంప్.. 100శాతం సుంకాలు.. ఈయూకు కీలక సూచన
- నిలిచిపోయిన గ్రీన్ కార్డ్ వీసాలు
- మేధో సంపత్తి హక్కుల రక్షణపై MoCI అవగాహన..!!
- ఖతార్ సార్వభౌమత్వాన్ని కాపాడాలి: సౌదీ యువరాజు, జోర్డాన్ కింగ్
- కార్మికులకు 700 ఉచిత టిక్కెట్లు.. దుబాయ్ వ్యాపారవేత్త ఉదారత..!!
- ఒకే రోజు 382 పార్కింగ్ ఉల్లంఘనలు నమోదు..!!
- రాజు హమద్ తో ప్రిన్స్ ఫైసల్ సమావేశం..!!
- సోహార్లోని అగ్నిప్రమాదం.. ఆరుగురు రెస్క్యూ..!!