ఫోన్ కాల్ స్కామ్: ఆరుగురు వలసదారుల అరెస్ట్
- March 29, 2018
మస్కట్: ఫోన్ కాల్ స్కామ్‌కి సంబంధించి ఆరుగురు వలసదారుల్ని యాంటీ క్రైమ్ మరియు ఇన్వెస్టిగేషన్ ఫోర్సెస్ అదుపులోకి తీసుకున్నాయి. పోలీసులు ఈ విషయమై మాట్లాడుతూ, నిందితుల నుంచి మొబైల్ ఫోన్లు, సిమ్ కార్డ్స్, ఇతర కమ్యూనికేషన్ డివైజెస్‌ని స్వాధీనం చేసుకున్నామని అన్నారు. రాయల్ ఒమన్ పోలీస్ అధికారి మాట్లాడుతూ, ఇన్వెస్టిగేషన్ మరియు యాంటీ క్రైమ్ డిపార్ట్‌మెంట్ - మస్కట్, ఆరుగురు ఆసియా జాతీయుల్ని ఎలక్ట్రానిక్ ఫ్రాడ్ కేసులో అరెస్ట్ చేశామని చెప్పారు. నిందితులు, క్యాష్ ప్రైజ్ గెలిచారంటూ అమాయకులకు ఫోన్ చేసి, వారి నుంచి డబ్బులు దోచుకుంటున్నట్లు పోలీసులు వివరించారు. నిందితులపై చట్ట పరమైన చర్యల నిమిత్తం, వారిని జ్యుడీషియల్ అథారిటీస్‌కి అప్పగించారు పోలీసులు.
తాజా వార్తలు
- RBVRR పోలీస్ అకాడమీలో ప్రొబేషనరీ డిప్యూటీ సూపరింటెండెంట్స్ శిక్షణ ప్రారంభం
- 80వేల వీసాలను రద్దు చేసిన డొనాల్డ్ ట్రంప్
- వర్జీనియా లెఫ్టినెంట్ గవర్నర్గా ఎన్నికైన తొలి భారతీయ ముస్లిం మహిళ
- ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ముఖ్య గమనిక..
- WPL 2026 రిటెన్షన్ లిస్ట్ ఇదే..
- టీ20 ప్రపంచకప్ ఫైనల్కు వేదిక ఖరారు..!
- తెలంగాణలో కొత్తగా మూడు టీటీడీ దేవాలయాలు: టీటీడీ ఛైర్మన్
- స్పీడ్మాక్స్ సైకిళ్లను కొనవద్దు..CPA హెచ్చరిక..!!
- దుబాయ్ లో త్వరలో కొత్త వాటర్పార్క్..!!
- బహ్రెయిన్ లో ముగిసిన కొత్త సీజన్ కు రిజిస్ట్రేషన్లు..!!







