యూఏఈలో ఎటిసలాట్ సేవల్లో అవాంతరాలు
- March 29, 2018
యూఏఈ:యూఏఈ టెలికామ్ సంస్థ ఎటిసలాట్, మొబైల్ నెట్‌వర్క్‌ని అప్‌గ్రేడ్ చేస్తున్న దరిమిలా, మూడు నెలలపాటు అవాంతరాలు తలెత్తవచ్చునని పేర్కొంది. వినియోగదారులకు ముందస్తుగా క్షమాపణ చెబుతున్నామనీ ఎటిసలాట్ సంస్థ వివరించింది. ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, ఐజీ డాటా వంటి విభాగాల్లో అప్‌గ్రెడేషన్ వర్క్ జరుగుతోందని తెలిపింది ఎటిసలాట్. మొబైల్ డేటాలో సరికొత్త అనుభూతిని వినియోగదారులకు కల్పించేందుకు అప్‌గ్రెడేషన్ జరుగుతోందనీ, ఈ నేపథ్యంలో వినియోగదారులకు సమస్యలు తాత్కాలికంగా తలెత్తే అవకాశం వుందనీ, వీలైనంతవరకు సమస్యలు తగ్గించేలా చూస్తామని ఎటిసలాట్ వెల్లడించింది. సిస్టమ్ అప్‌గ్రెడేషన్ సమయంలో అవాంతరాలతో సేవలు కొనసాగుతాయని, సేవలు నిలిచిపోయే ప్రసక్తే లేదని సంస్థ స్పస్టం చేసింది.
తాజా వార్తలు
- ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ముఖ్య గమనిక..
- WPL 2026 రిటెన్షన్ లిస్ట్ ఇదే..
- టీ20 ప్రపంచకప్ ఫైనల్కు వేదిక ఖరారు..!
- తెలంగాణలో కొత్తగా మూడు టీటీడీ దేవాలయాలు: టీటీడీ ఛైర్మన్
- స్పీడ్మాక్స్ సైకిళ్లను కొనవద్దు..CPA హెచ్చరిక..!!
- దుబాయ్ లో త్వరలో కొత్త వాటర్పార్క్..!!
- బహ్రెయిన్ లో ముగిసిన కొత్త సీజన్ కు రిజిస్ట్రేషన్లు..!!
- కువైట్ లో 28 ఏళ్ల తర్వాత కేరళ సీం విజయన్..!!
- మదీనాలో ఇద్దరు మహిళలు సహా ముగ్గురు అరెస్ట్..!!
- ఖతార్ లో సీజనల్ వెజిటేబుల్ మార్కెట్లు ప్రారంభం..!!







