డేటా లీకేజీకి అడ్డుకట్ట వేస్తూ కొత్త ఫీచర్‌ను ప్రవేశపెట్టనున్న ఫేస్బుక్
- March 29, 2018
న్యూయార్క్: డేటా లీక్ కాకుండా ఉండేందుకు ఫేస్బుక్ చర్యలకు ఉపక్రమించింది. ఫేస్బుక్ ఖాతాదారుల వ్యక్తిగత సమాచారం చోరికి గురి కాకుండా ఉండేందుకు గాను ప్రైవసీ కంట్రోల్లో మార్పులకు శ్రీకారం చుట్టింది. ఈ మేరకు ఫేస్బుక్ కొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తెచ్చింది.
యూజర్ల గోప్యతను కాపాడేందుకు గాను యాక్సెస్ యూవర్ ఇన్మర్మేషన్ అనే కొత్త ఫీచర్‌ను తీసుకొచ్చే విషయాన్ని ఫేస్బుక్ పరిశీలిస్తోంది. ఈ మేరకు ఫేస్బుక్ ఈ విషయాన్ని వెల్లడించింది.
ఫేస్బుక్ ఖాతాదారుల వ్యక్తిగత సమాచారం లీకైన ఘటన ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఫేస్బుక్ సీఈఓ జుకర్ బర్గ్ ఈ విషయమై భవిష్యత్తులో ఈ తరహ ఘటనలు చోటు చేసుకోకుండా జాగ్రత్తలు కూడ తీసుకొంటామని ప్రకటించారు.
భవిష్యత్తులో డేటా సెక్యూరిటీ యూజర్ల నియంత్రణలో ఉండేలా ఫేస్బుక్ యాజమాన్యం చర్యలు తీసుకొంటుంది. ఈ మేరకు ఫేస్బుక్ చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ అధికారి ఎరిన్ ఎగాన్, డిప్యూటీ జనరల్ న్యాయవాది అషిలే బెరింగ్గెర్ లు ప్రకటించారు.
ఫేస్బుక్ యూజర్ల సమాచార భాగస్వామ్యంపై మరింత నియంత్రణ ఇచ్చేందుకు గాను కొత్త గోప్యతా టూల్ ను పరిచయం చేయనున్నట్టు చెప్పింది. మెనూలో సెక్యూరిటీ షార్ట్‌కట్స్ ద్వారా యూజర్ల ఫేస్బుక్ ఖాతాలకు అదనపు భద్రతను అందించడంతోపాటు , వినియోగదారులు డేటా, యాక్టివిటీపై ఇతరుల యాక్సెస్‌ను మరింత నియంత్రిచుకోవచ్చని వారు తెలిపారు. అంతేకాదు యాడ్స్‌కు కూడా చెక్ పెట్టవచ్చని తెలిపారు. అయితే ఇది ఇంకా ప్రయోగదశలో ఉందనీ, త్వరలోనే ఈ ఫీచర్‌ను లాంచ్ చేస్తామని వెల్లడించారు.
తాజా వార్తలు
- RBVRR పోలీస్ అకాడమీలో ప్రొబేషనరీ డిప్యూటీ సూపరింటెండెంట్స్ శిక్షణ ప్రారంభం
- 80వేల వీసాలను రద్దు చేసిన డొనాల్డ్ ట్రంప్
- వర్జీనియా లెఫ్టినెంట్ గవర్నర్‌గా ఎన్నికైన తొలి భారతీయ ముస్లిం మహిళ
- ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ముఖ్య గమనిక..
- WPL 2026 రిటెన్షన్ లిస్ట్ ఇదే..
- టీ20 ప్రపంచకప్ ఫైనల్‌కు వేదిక ఖరారు..!
- తెలంగాణలో కొత్తగా మూడు టీటీడీ దేవాలయాలు: టీటీడీ ఛైర్మన్
- స్పీడ్‌మాక్స్ సైకిళ్లను కొనవద్దు..CPA హెచ్చరిక..!!
- దుబాయ్ లో త్వరలో కొత్త వాటర్‌పార్క్..!!
- బహ్రెయిన్ లో ముగిసిన కొత్త సీజన్ కు రిజిస్ట్రేషన్లు..!!







