అబ్బో! ఆ రైలు లగ్జరీ చూసారా!
- March 29, 2018
ప్యాంగ్‌యాంగ్, ఉత్తరకొరియా : ఉత్తరకొరియా నియంతలకు అత్యంత ప్రీతిపాత్రమైన రవాణా సాధనం ‘రహస్య రైలు’ లోపలి ఫొటోలు వెలుగులోకి వచ్చాయి. విమాన భయం ఉన్న కిమ్ జాంగ్ ఉన్ తండ్రి కిమ్ జాంగ్ ఇల్ ఈ రైలును ప్రత్యేకంగా తయారు చేయించుకున్నారు. అంతేకాకుండా ఈ రైలులో పలు ప్రపంచదేశాలకు ఆయన ప్రయాణించారు కూడా.
దాదాపు 90 పెట్టెలు ఉండే ఈ రైలులో దేశాధ్యక్షుడు ప్రయాణిస్తున్న సమయంలో భద్రత రీత్యా ముందొక రైలు, వెనుక మరో రైలు కాపలా ఉంటాయి. బుల్లెట్ ప్రూఫ్ రైలు కావడంతో ఒక్కో పెట్టె భారీగా బరువు ఉంటుంది. దీంతో ఈ రైలు ప్రయాణించే వేగం అత్యధికంగా గంటకు 60 కిలోమీటర్లు మాత్రమే. లగ్జరీ సీటింగ్‌తో పాటు ప్రపంచదేశాలకు చెందిన వైన్, ఆహార పదార్థాలు ఎల్లప్పుడూ ఈ రైలులో సిద్ధంగా ఉంటాయి.
ఇప్పటివరకూ ఉత్తరకొరియాలోని పలు ప్రదేశాలకు ప్రయాణించడానికి మాత్రమే రైలును ఉపయోగించిన కిమ్.. తొలిసారిగా చైనా ట్రిప్‌కు ఈ రైలును వాడారు. ఈ సందర్భంగా చైనా అధికారులతో చర్చలు జరిపేందుకు జర్నలిస్టులను రైలులోకి అనుమతించారు.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..