దొంగ నా కొడుకు..జున్నుగాడికి హ్యాపీ బర్త్ డే: నాని

- March 29, 2018 , by Maagulf
దొంగ నా కొడుకు..జున్నుగాడికి హ్యాపీ బర్త్ డే: నాని

టాలీవుడ్ ఇండస్ట్రీలో నేచురల్ స్టార్ గా మంచి పేరు తెచ్చుకొని వరుస విజయాలతో దూసుకు పోతున్న హీరో నాని. ఈ మద్య అ! సినిమాతో నిర్మాతగా కూడా మారాడు. అసిస్టెంట్ డైరెక్టర్ గా సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన నాని..తర్వాత అష్టాచమ్మ సినిమాతో హీరోగా మారాడు. ఎవడే సుబ్రమాణ్యం, భలే భలే మగాడివోయ్ తర్వాత నాని మళ్లీ వెనక్కి తిరిగి చూసుకోలేదు. 

ప్రస్తుతం నాని ఇండస్ట్రీలో పైసా వసూల్ హీరో అనే చెప్పాలి. త్వరలో నాని నటించిన 'కృష్ణార్జున యుద్దం' సినిమా రిలీజ్ కాబోతుంది. ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్..టీజర్, సాంగ్స్ కి మంచి రెస్పాన్స్ వస్తుంది. నేడు నాని ముద్దుల కొడుకు పుట్టిన రోజు. అందుకు నాని ట్విట్టర్ లో ముద్దుగా ఈ లిటిల్ రాస్కేల్ పుట్టి ఒక సంవత్సరం అయ్యింది,దొంగ నా కొడుకు అని ప్రేమతో పోస్ట్ ని ట్వీట్ చేసి విషెస్ తెలియ చేసాడు. 

2012లో అంజనాతో నానికి పెళ్లయ్యింది. వారికి బాబు పుట్టగా... అర్జున్ అనే పేరు పెట్టారు. కొడుకు బర్త్ డే సెలబ్రేషన్స్‌ను కూడా గ్రాండ్‌గా చేస్తున్నట్లు తెలుస్తోంది. నాగార్జునతో మల్టీ స్టారర్ ప్రారంభమయ్యింది. ఫ్యాన్స్ కూడా నేచురల్ స్టార్‌ ఫోటోపై కామెంట్స్ పెడుతున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com