చెన్నై ప్రజానీకానికి సాయం చేయడానికి సినీ తారలు రెడీ..
- December 01, 2015
జనజీవనాన్ని అతలాకుతలం చేస్తున్న భారీవర్షాల నుంచి చెన్నై ప్రజలు సురక్షితంగా ఉండాలంటూ సామాన్య ప్రజలతో పాటు సినీ తారలు కూడా కోరుతున్నారు. తన సోషల్ నెట్వర్కింగ్ సైట్ల ద్వారా ప్రజలకు కావాల్సిన సమాచారాన్ని అందించటంతో పాటు అభిమానులు సహాయ కార్యక్రమాల్లో పాల్గొనాలంటూ కోరుతున్నారు. సిద్దార్థ, లారెన్స్ లాంటి మరికొంత మంది ప్రత్యక్షంగా సాయం చేయడానికి రెడీ అవుతున్నారు. వర్షాలు, వరదలు కారణంగా ఆకలితో అలమటిస్తున్న ప్రజానీకానికి సాయం చేయడానికి హీరో సిద్దార్ధ్ ముందుకు వచ్చాడు. ఆహార పొట్లాలను ఇవ్వదలచిన వారు తనకు ఫోన్ చేయాలంటూ తన ట్విట్టర్ లో పోస్ట్ చేసిన సిద్దార్థ్, సాయం చేసే ఉద్దేశం లేనివారు ఇంట్లోనే ఉండాలంటూ కోరాడు. అలాంటి వారు రోడ్ల మీదకు రావడం వల్ల సహాయ కార్యక్రమాలకు ఇబ్బందులు కలిగే అవకాశం ఉందంటూ ట్వీట్ చేశాడు. చెన్నైలోని చాలా ప్రాంతాల్లో పరిస్థితిని కూడా తన ట్విట్టర్ లో తెలిపాడు సిద్దార్ధ్. మరో తమిళ స్టార్ లారెన్స్ కూడా చెన్నై వర్షాలపై స్పందించాడు. చాలాకాలంగా రాఘవేంద్ర చారిటబుల్ ట్రస్ట్ ఆద్వర్యంలో సహాయ కార్యక్రమాలు నిర్వహిస్తున్న లారెన్స్.. చెన్నై వరద బాధితుల కోసం పదిలక్షల రూపాయల ఆర్థిక సాయంప్రకటించాడు. వీరితో పాటు కుష్బూ, ఐశ్వర్య ధనుష్, అనిరుధ్, సౌందర్య రజనీకాంత్, విశాల్, అమీజాక్సన్ లాంటి కోలీవుడ్ స్టార్స్, ఇంకా బాలీవుడ్ హీరోయిన్ ప్రియాంకా చోప్రా కూడా చెన్నై పరిస్థితి పై ట్విట్టర్ లో స్పందించారు.
తాజా వార్తలు
- అవాలి అభివృద్ధి మాస్టర్ ప్లాన్ పై కింగ్ హమద్ సమీక్ష..!!
- యూఏఈ దిర్హమ్కు రూ.25కు చేరువలో భారత రూపాయి..!!
- విదేశీ వాహనదారులకు ఖతార్ గుడ్ న్యూస్..!!
- రియాద్ లో దక్షిణ యెమెన్ నాయకులు..కీలక ప్రకటన..!!
- కువైట్ ‘లులు’లో బ్రిటిష్ డెయిరీ ప్రొడక్ట్స్ వీక్..!!
- ఒమన్‌లో 8.5% పెరిగిన బ్యాంకు లోన్లు..!!
- ఖమ్మంలో సీఎం రేవంత్ హాట్ అనౌన్స్మెంట్, అభివృద్ధికి గ్రీన్ సిగ్నల్!
- రేపు భారత్ లో పర్యటించనున్న యూఏఈ అధ్యక్షుడు
- న్యూజెర్సీ శ్రీ శివ విష్ణు దేవాలయంలో ‘నారీ శక్తి’ మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం
- ఖతార్ లో విద్యార్థులకు 4వేల ఫ్రీ, రాయితీ సీట్లు..!!







