వాట్సాప్‌లో కొత్త ఫీచర్ల ధమాకా

- March 29, 2018 , by Maagulf
వాట్సాప్‌లో కొత్త ఫీచర్ల ధమాకా

ప్రముఖ ఇన్‌స్టెంట్ మెసేజింగ్ సర్వీస్ వాట్సాప్ మరో సరికొత్త బేటా అప్‌డేట్‌ను ప్లే స్టోర్‌లో రిలీజ్ చేసింది. ఈ అప్‌డేట్ ద్వారా జిఫ్ సెర్చ్ పేరుతో మరో ప్రయోగాత్మక పీచర్ న వాట్సాప్ ప్రపంచానికి పరిచయం చేసింది. గూగల్ ప్లే స్టోర్‌లో లభ్యమవుతోన్న ఈ బేటా ప్రోగ్రామ్‌ను 2.18.93 అప్‌డేట్ వర్షన్ ద్వారా ఆండ్రాయిడ్ యూజర్లు పొందవచ్చు. ప్రస్తుతానికి టెస్టింగ్ దశలో ఉన్న ఈ ఫీచర్‌ను త్వరలోనే అఫీషియల్ యాప్‌లోకి తీసుకురాబోతున్నట్లు WABetaInfo తెలిపింది. ఈ ఫీచర్‌లో భాగంగా వివిధ క్యాటగిరీలకు సంబంధించిన జిఫ్ ఫైల్స్ అందుబాటులో ఉంటాయి. యూజర్ తన అభిరుచులకు అనుగుణంగా కావాల్సిన జిఫ్ ఫైల్‌ను వెతకిపట్టకునే వీలుంటుంది.

త్వరలో వాట్సాప్ ద్వారా చెల్లింపులు..
ఇంటర్నెట్‌లో హల్‌చల్ చేస్తోన్న మరికొన్ని రిపోర్ట్స్ ప్రకారం వాట్సాప్ ఆండ్రాయిడ్ బేటా వర్షన్ కోసం అందుబాటులోకి తీసుకువచ్చిన కొత్త అప్‌డేట్‌లో మనీ ట్రాన్స్‌ఫర్ సదుపాయాన్ని కూడా అందుబాటులో ఉంచినట్లు తెలుస్తోంది. క్యూఆర్ కోడ్‌లను స్కాన్ చేసి యూపీఐ పిన్‌లను ఎంటర్ చేయటం ద్వారా నగదును ట్రాన్స్‌ఫర్ చేసుకునే వీలుంటుందట. ఈ పేమెంట్స్ ఫీచర్ ద్వారా రోజుకు 20 లావాదేవీలు మాత్రమే నిర్వహించుకునే వీలుంటుందట. వాట్సాప్ పేమెంట్స్ ఫీచర్ భారత్‌లో ఇంకా అఫీషియల్‌గా రిలీజ్ కావల్సి ఉంది.

వాట్సాపే వెబ్ బ్రౌజర్ అయితే..
కొత్తగా ఆలోచిస్తే టెక్నాలజీలో ఏదైనా సాధ్యమే. కొన్ని స్మార్ట్ ట్రిక్స్‌ను అప్లై చేయటం ద్వారా గూగుల్‌తో పనిలేకుండా మీ వాట్సాప్ అకౌంట్‌నే సెర్చ్ ఇంజిన్‌లా మార్చేసుకుని బ్రౌజింగ్ చేసుకోవచ్చు. ముందుగా మీ స్మార్ట్2ఫోన్‌లో Search Engine పేరుతో ఓ కాంటాక్ట్‌ను క్రియేట్ చేయండి. ఆ కాంటాక్ట్‌కు సంబంధించిన ఫోన్ నెంబర్‌గా ఈ సంఖ్యను ఫీడ్ చేయండి. '8015984514'. ఇప్పుడు మీ వాట్సాప్ అకౌంట్‌ను ఓపెన్ చేసి సెట్టింగ్స్‌లోకి వెళ్లి Search Engine పేరుతో ఓ కొత్త గ్రూప్‌ను క్రియేట్ చేయండి.
 
గ్రూప్ క్రియేట్ అయిన తరువాత ..
గ్రూప్ క్రియేట్ అయిన తరువాత, ఫోన్‌లో మీకు కొత్తగా క్రియేట్ చేసిన Search Engine కాంటాక్ట్‌ను Participants క్రింద యాడ్ చేయండి. గ్రూప్ విజయవంతంగా క్రియేట్ అయినట్లయితే, మీ వాట్సాప్ సెర్చ్ ఇంజిన్ రెడీ అయినట్లే. సెర్చ్ ఇంజిన్ రెడీ అయిన వెంటనే మీకు కొన్ని టిప్స్‌తో కూడిన మెసేజెస్ రావటం మొదలుపెడతాయి. వీటి సహాయంతో మీరు వాట్సాప్ ద్వారా ఇంటర్నెట్‌ను బ్రౌజ్ చేసుకోవచ్చు.
 
వాట్సాప్‌ను వికీపిడియాలా వాడుకోవాలంటే..?
వికీపిడియా సమచారాన్ని తెలుసుకోవాలంటే Wiki అని Search Engine గ్రూప్ చాట్‌లో టైప్ చేయండి. ఇంగ్లీష్ న్యూస్ ఛానల్‌లో జాయిన్ అవ్వాలంటే type <+NEWS> and to unsubscribe anytime, send <-NEWS> ఏదైనా పదానికి సంబంధించి అర్థం తెలుసుకోవాలనుకంటే <+DICT WORD> అని సెర్చ్ ఇంజిన్ గ్రూప్ చాట్‌లో టైప్ చేయండి. క్రికెట్ ఛానల్‌లో జాయిన్ అవ్వాలంటే <+CRICKET> అని అని సెర్చ్ ఇంజిన్ గ్రూప్ చాట్‌లో టైప్ చేయండి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com