ఆంధ్రప్రదేశ్‌ గవర్నర్‌గా వెళ్లను..కిరణ్‌ బేడీ

- March 30, 2018 , by Maagulf
ఆంధ్రప్రదేశ్‌ గవర్నర్‌గా వెళ్లను..కిరణ్‌ బేడీ

యానాం : ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర గవర్నర్‌గా తాను వెళుతున్నట్లు వస్తున్న వార్తలను పుదుచ్చేరి లెఫ్ట్‌నెంట్‌ గవర్నర్‌ కిరణ్‌ బేడీ తోసిపుచ్చారు. తాను ఏపీకి గవర్నర్‌గా వెళ్లనున్నట్లు వచ్చే వార్తలు నిరాధారమని ఆమె అన్నారు. ఆమె నిన్న (గురువారం) విలేకరులతో మాట్లాడుతూ తాను చేపట్టే కార్యక్రమాలతో ఈ ప్రాంతంలో తనకు మంచి పేరు వస్తోందని, ఈ తరుణంలో పుదుచ్చేరిలోనే ఎల్జీగా పూర్తికాలం కొనసాగుతానన్నారు. ఇక ఏ రాష్ట్రానికి వెళ్లే ప్రసక్తే లేదని కిరణ్‌ బేడీ స్పష్టం చేశారు. కాగా కిరణ్‌ బేడీ వెళ్లిపోతున్నట్లు వచ్చిన వార్తలతో సంబరాలు చేసుకున్న కాంగ్రెస్‌ వర్గీయులు ...ఆమె క్లారిటీ ఇవ్వడంతో నిరుత్సాహానికి గురయ్యారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com