17మంది సజీవ దహనం..
- March 30, 2018
అంకారా : టర్కీలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచోసుకుంది. ఈ ఘటనలో 17 మంది సజీవదహనమవ్వగా.. 36 మంది తీవ్రంగా గాయపడ్డారు. అతి వేగంగా దూసుకొచ్చిన ఓ మినీ బస్ అదుపు తప్పి కరెంట్ పోల్‌కు ఢీ కొట్టడంతో ఇంజన్ నుంచి ఒక్క సారిగా మంటలు చెలరేగాయి. క్షణాల్లోనే బస్సు నిండా మంటలు చెలరేగటం, అందరూ నిద్ర మత్తులో ఉండటంతో మృతుల సంఖ్య పెరిగినట్లు తెలుస్తోంది.
ఇగ్దీస్ ప్రోవిన్స్ పరిధిలో చోటు చేసుకుందని.. ఈ బస్సులో అఫ్గానిస్తాన్, పాకిస్తాన్, ఇరాన్ దేశస్తులుగా గుర్తించామని, వీరు ఎలాంటి అనుమతి పత్రాలు లేకుండా టర్కీలోకి ప్రవేశించారని టర్కీ పోలీసులు పేర్కొన్నారు. అంతేకాకుండా వీరి దగ్గర ఎలాంటి ధ్రువీకరణ పత్రాలు లేకపోవటంతో వీరిపై పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. క్షతగాత్రులను చికిత్స అనంతరం విచారణ చేపడతామన్నారు
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..