లైట్‌ వెహికిల్స్‌ కోసం కొత్త రిజిస్ట్రేషన్‌ ప్లేట్‌

- March 30, 2018 , by Maagulf
లైట్‌ వెహికిల్స్‌ కోసం కొత్త రిజిస్ట్రేషన్‌ ప్లేట్‌

అబుదాబీ పోలీసులు, లైట్‌ వెహికిల్స్‌ కోసం కొత్త రిజిస్ట్రేషన్‌ నెంబర్‌ ప్లేట్‌ని ప్రవేశపెట్టారు. వాహనం ముందు వెనుక భాగంలో అమర్చేందుకు వీలుగా రెండు సెపరేట్‌ డిజైన్స్‌ని ఎంపిక చేశారు. అబుదాబీ పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం కొత్త నెంబర్‌ ప్లేట్‌ పెయిర్‌ ధర ఒక్కోటి 500 దిర్హామ్‌లు. ఫ్రంట్‌ నెంబర్‌ ప్లేట్‌లో అబుదాబీ లోగోతో, వెనుక భాగంలోని ఏ్లట్‌ రెడ్‌ రిబ్బన్‌ షేప్‌లో వుంటుంది. బంపర్‌ మిడిల్‌ ప్లేస్‌లో మాత్రమే ప్రంట్‌ వెహికిల్‌ రిజిస్ట్రేషన్‌ ప్లేట్‌ని వుంచాల్సి వుంఉటంది. రిజిస్ట్రేషన్‌ ప్లేట్‌ రీప్లేస్‌మెంట్‌ ఆప్షనల్‌ అనీ, కొత్త లేదా వాలీడ్‌ లైసెన్స్‌ రిజిస్ట్రేషన్‌ ప్లేట్స్‌ లేదా రీ-రిజిస్ట్రేషన్‌ వాహనాలకు ఇవి అందుబాటులో వుంటాయనీ అధికారులు తెలిపారు. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com