డ్రగ్స్ స్మగ్లింగ్: మహిళకు 10 ఏళ్ళ జైలు
- March 30, 2018
1 కిలో మరిజువానాని తన బ్యాగ్ ద్వారా స్మగుల్ చేసేందుకు యత్నించిన 28 ఏళ్ళ మహిళకు న్యాయస్థానం పదేళ్ళ జైలు శిక్ష విధించింది. కమెరోనియన్ మహిళ, జనవరి 9న విజిట్ వీసాపై దుబాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌లో ల్యాండ్ అయ్యింది. ఈ సందర్భంగా ఆమె ట్రావెల్ బ్యాగ్‌ని పరిశీలించిన కస్టమ్స్ ఇన్స్పెక్టర్కి అందులో నిషేధిత మరిజువానా లభ్యమయ్యింది. ఆమెను వైద్య పరీక్షలకు పంపగా, డ్రగ్స్ టెస్ట్‌లో నెగెటివ్ వచ్చింది. విచారణలో నిందితురాలు నేరం అంగీకరించింది. పదేళ్ళ జైలు శిక్షతోపాటుగా డిపోర్టేషన్ అలాగే 60,000 దిర్హామ్‌ల జరీమానాని నిందితురాలికి న్యాయస్థానం విధించింది. కోర్టు తీర్పుని సవాల్ చేసుకునే అవకాశం వుంది.
తాజా వార్తలు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ సీజన్ 14 వచ్చేసింది..!!
- వరల్డ్ టాప్ 10 సురక్షితమైన దేశాలలో ఒమన్..!!
- కువైట్ లో "దిస్ ఈస్ యువర్ రోల్" ప్రారంభం..!!
- బహ్రెయిన్, ఇండియా మధ్య లీగల్, ట్యాక్స్ సహకారం..!!
- ఒమన్‌తో మ్యాచ్..టీమ్ఇండియాకు ఎంతో ప్రత్యేకం..
- హైదరాబాద్: గిన్నిస్ బుక్ లో తెలంగాణ ‘బతుకమ్మ’
- భారీ వర్షానికి చిగురుటాకులా వణికిన హైదరాబాద్..
- నటుడు రోబో శంకర్ మృతి..