మక్కా పేలుళ్ల నిందితులు చర్లపల్లి జైలుకు

- March 30, 2018 , by Maagulf
మక్కా పేలుళ్ల నిందితులు చర్లపల్లి జైలుకు

హైదరాబాద్: భద్రతా కారణాల వల్ల చంచల్‌గూడ జైలులో రిమాండ్‌లో ఉన్న మక్కా పేలుళ్ల నిందితులను శుక్రవారం కోర్టు అనుమతితో అధికారులు చర్లపల్లి జైలుకు భారీ బందోబస్తు మధ్య తరలించారు. అజ్మీర్‌ బాంబు పేలుళ్ల కేసులో జైపూర్‌ జైలులో ఉన్న మక్కా పేలుళ్ల నిందితులు దేవేంద్రగుప్త, లోకేష్‌ శర్మ, రాజేష్‌ చౌదరిని కోర్టు కేసుల విచారణ నిమిత్తం ఈ నెల 28న ఎన్‌ఐఏ అధికారులు చంచల్‌గూడ జైలుకు తరలించిన విషయం తెలిసిందే. ఉగ్రవాద ఆరోపణలు ఎదుర్కొంటున్న 16మంది యువకులు చంచల్‌గూడ జైలులో ఉండడంతో ఇబ్బందులు తలెత్తే ఆవకాశం ఉందని జైలువర్గాలు భావించి ముందుజాగ్రత్త చర్యలో భాగంగా మక్కా పేలుళ్ల నిందితులను కోర్టు అనుమతితో చర్లపల్లి జైలుకు తరలించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com