టీ20 చరిత్రలో రికార్డు స్కోర్..
- March 31, 2018
ముక్కోణపు మహిళా టీ20 సిరీస్ లో ఆసీస్ పైచేయి సాధించింది. ఇంగ్లాండ్ తో జరిగిన ఫైనల్ మ్యాచ్ లో గెలిచి సిరీస్ కైవసం చేసుకుంది. ఈ మ్యాచ్ లో మహిళల టీ20 చరిత్రలో అత్యధిక పరుగులు చేసిన టీమ్ గా ఆసీస్ రికార్డుల్లోకి ఎక్కింది. ఈ క్రమంలో ఇప్పటివరకు దక్షిణాఫ్రికా (205) పేరిట ఉన్న అత్యధిక పరుగుల రికార్డును (209) సొంతం చేసుకుంది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ కు దిగిన ఆసీస్ నాలుగు వికెట్ల నష్టానికి 209 పరుగుల భారీ స్కోర్ సాధించింది. అనంతరం 210 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లాండ్ 11.3 ఓవర్లలో 96 పరుగులకే ఆల్ అవుట్ అయింది. దీంతో ఆసీస్ ఫైనల్ మ్యాచ్ లో గెలిచి సిరీస్ ను సొతం చేసుకుంది. కాగా ఈ సిరీస్ ను గెలవడంతో ఆస్ట్రేలియా గత మూడేళ్ళలో మొదటి సిరీస్ ను గెలుచుకున్నట్లయింది.
తాజా వార్తలు
- అమెరికాకు మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ ను అప్పగించిన ఖతార్..!!
- ద్వైపాక్షిక, ప్రాంతీయ పరిస్థితులపై అమెరికా–సౌదీ చర్చలు..!!
- సలాలా తీరంలో ఒమన్ పౌరుడిని రక్షించిన కోస్ట్ గార్డ్..!!
- కువైట్లో వారాంతంలో తీవ్రమైన ఎండలు.. హెచ్చరిక..!!
- అల్ మజారె స్ట్రీట్ విస్తరణకు అధ్యయనం.. ట్రాఫిక్ సమస్యలకు చెక్..!!
- సమ్మర్ లో పిల్లల భద్రతపై ఫుజైరా పోలీసుల హెచ్చరిక..!!
- యూఏఈలో తొలి ‘లాంగెవిటీ మెడిసిన్’ అకడమిక్ కోర్సులు ప్రారంభించనున్న తుంబే గ్రూప్
- నకిలీ యాప్ల పట్ల అప్రమత్తంగా ఉండండి.. దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- 25 ఏళ్ల తర్వాత అప్పు తీర్చిన స్నేహితుడు..
- భారత్, న్యూజిలాండ్ ల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యం







