మనామా:యూజ్‌డ్‌ బుక్స్‌ పంపిణీ

- March 31, 2018 , by Maagulf
మనామా:యూజ్‌డ్‌ బుక్స్‌ పంపిణీ

మనామా: భారత వలసదారుల సోషల్‌ మరియు కల్చరల్‌ ఫోరమ్‌ (ఎండెక్స్‌ బహ్రెయిన్‌), బహ్రెయిన్‌ కేరళీయ సమాజం సంయుక్తంగా యూజ్‌డ్‌ బుక్స్‌ని విద్యార్థులకు ఏప్రిల్‌ 1 నుంచి పంపిణీ చేయనుంది. మార్చి 12 నుంచి నిర్వహించిన క్యాంపెయిన్‌లో బుక్స్‌ని పెద్దయెత్తున కలెక్ట్‌ చేశారు. బికెఎస్‌ హాల్‌లో బుక్స్‌ పంపిణీ ఏప్రిల్‌ 1 నుంచి జరుగుతుందని నిర్వాహకులు తెలిపారు. బికెఎస్‌, ఇండియన్‌ క్లబ్‌, సమస్థ కేరళ సున్ని జమాత్‌, కన్నూ అయ్యప్ప టెంపుల్‌, సాక్రెడ్‌ హార్ట్‌ చర్చ్‌ ఈ కలెక్షన్‌ క్యాంపెయిన్‌లో పాల్గొన్నాయి. కెఎంసిసి కాలికట్‌ డిస్ట్రిక్ట్‌ లేడీస్‌ వింగ్‌, కోయిలాండికోట్టమ్‌ కూడా బుక్స్‌ కలెక్షన్‌లో పాల్గొన్నాయి. టెక్స్‌ట్‌ బుక్స్‌తోపాటుగా, గైడ్స్‌, క్వశ్చన్‌ పేపర్స్‌, మేనేజ్‌మెంట్‌ బుక్స్‌ సైతం కలెక్ట్‌ చేసినవాటిలో వున్నాయి. సుమారు 500 మంది విద్యార్థులకు ఈ బుక్స్‌ అందించేలా ఏర్పాటు చేసినట్లు నిర్వాహకులు తెలిపారు. అవసరమైన విద్యార్థులకు ఉచిత స్కూల్‌ యూనిఫామ్స్‌ పంపిణీ చేసేందుకు ప్రయత్నిస్తున్నామని ఇండెక్స్‌ అఫీషియల్‌ రఫీక్‌ అబ్దుల్లా చెప్పారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com