జింకని వేటాడిన కేసులో నిందితులకి జైలు
- March 31, 2018
మస్కట్: పీనల్ అపీల్ కోర్ట్, అరేబియన్ డీర్‌ని వేటాడిన కేసులో నిందితులుకి జైలు శిక్ష విధించింది. విలాయత్ ఆఫ్ అమెరాత్‌లోని అల్ సరీన్ నేచుర్ రిజర్వ్‌లో జింకను వేటాడినట్లు నిందితులపై అభియోగాలు మోపబడ్డాయి. నిందితులకు ఆరు నెలల జైలు శిక్షను న్యాయస్థానం ఖరారు చేసింది. ఈ కేసులో తొలి నిందితుడికి అదనంగా మరో నెల రోజుల జైలు శిక్షను న్యాయస్థానం విధించింది. లైసెన్స్ లేకుండా డ్రైవింగ్ చేయడం, అలాగే లైసెన్స్ లేకుండా గన్ కలిగి వుండడం అనే అభియోగాలు ఈయనపై మోపబడ్డాయి. నేచురల్ లైఫ్ కంట్రోల్ డిపార్ట్‌మెంట్ పెట్రోల్స్, అల్ సరీన్ నేచుర్ రిజర్వ్‌లో అరేబియన్ డీర్‌ని వేటాడినట్లు గుర్తించాయి. వెంటనే రాయల్ ఒమన్ పోలీస్‌కి సమాచారం అందించగా, నిందితుల్ని అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి కత్తినీ, గన్‌నీ, ఓ బ్యాగ్‌నీ స్వాధీనం చేసుకన్నారు పోలీసులు.
తాజా వార్తలు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ సీజన్ 14 వచ్చేసింది..!!
- వరల్డ్ టాప్ 10 సురక్షితమైన దేశాలలో ఒమన్..!!
- కువైట్ లో "దిస్ ఈస్ యువర్ రోల్" ప్రారంభం..!!
- బహ్రెయిన్, ఇండియా మధ్య లీగల్, ట్యాక్స్ సహకారం..!!
- ఒమన్‌తో మ్యాచ్..టీమ్ఇండియాకు ఎంతో ప్రత్యేకం..
- హైదరాబాద్: గిన్నిస్ బుక్ లో తెలంగాణ ‘బతుకమ్మ’
- భారీ వర్షానికి చిగురుటాకులా వణికిన హైదరాబాద్..
- నటుడు రోబో శంకర్ మృతి..