హౌతీ మిసైల్‌ని ధ్వంసం చేసిన సౌదీ

- March 31, 2018 , by Maagulf
హౌతీ మిసైల్‌ని ధ్వంసం చేసిన సౌదీ

రియాద్‌: సౌదీ ఎయిర్‌ డిఫెన్స్‌, హౌతీ మిలీషియా సంధించిన మిస్సైల్‌ని ధ్వంసం చేసింది. కింగ్‌డమ్‌కి చెందిన సదరన్‌ సిటీ నజ్రాన్‌ వైపుగా దూసుకొస్తున్న మిస్సైల్‌ని ధ్వంసం చేసినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. రెసిడెన్షియల్‌ ఏరియాస్‌ లక్ష్యంగా ఈ మిస్సైల్‌ని సంధించినట్లు అధికార వర్గాలు స్పష్టం చేశాయి. విజయవంతంగా మిస్సైల్‌ని అడ్డగించామనీ, ఈ క్రమంలో మిస్సైల్‌ తాలకు శకలాలు రెసిడెన్షియల్‌ ఏరియాలో పడ్డాయనీ, ఓ భారతీయ వలసదారుడికి వీటి కారణంగా స్వల్ప గాయాలయ్యాయని అధికారులు పేర్కొన్నారు. యెమెన్‌ నుంచి తరచూ హౌతీ మిలీషియా సౌదీ అరేబియాలోని ముఖ్య నగరాలపైకి మిస్సైల్స్‌తో విరుచుకుపడుతుండడం జరుగుతున్నా, సౌదీ ఎయిర్‌ డిఫెన్స్‌ ఎప్పటికప్పుడు చాకచక్యంగా ఆ మిస్సైల్స్‌ని గగనతలంలోనే కూల్చివేస్తున్నాయి. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com