7న భరత్ బహిరంగ సభ.!

- April 01, 2018 , by Maagulf
7న భరత్ బహిరంగ సభ.!

సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన తాజా చిత్రం 'భరత్ అనే నేను. ఈ మూవీ ఆడియో విడుదల కార్యక్రమాన్ని హైదరాబాద్ లో ఈ నెల 7వ తేదిన భరత్ బహిరంగ సభ పేరుతో నిర్వహించనున్నారు.. ఎల్ బి స్టేడియంలో ఆ రోజు సాయంత్రం ఆరు గంటలకు ప్రారంభమయ్యే ఈ కార్యక్రమంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో పాటు చిత్ర యూనిట్ పాల్గొంటున్నది..శ్రీమంతుడు ఫేమ్ కొరటాల శివ ఈ సినిమాకి దర్శకుడు. దేవిశ్రీ ప్రసాద్ సంగీత దర్శకుడు. బాలీవుడ్ భామ కైరా అద్వానీ కథానాయిక. ఈ మూవీ ఈ నెల 20వ తేదిన ప్రేక్షకుల ముందుకు రానుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com