'తెలుగు తరంగిణి ' వారి శ్రీ విళంబి నామ సంవత్సర ఉగాది వేడుకలు
- April 01, 2018
రస్ అల్ ఖైమా:తెలుగు తరంగిణి వారి ఆర్ధ్వర్యంలో యు.ఎ.ఇ లోని రస్ అల్ ఖైమా నగరంలో శ్రీ విళంబి నామ సంవత్సర ఉగాది ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుపుకున్నారు.
ప్రార్ధనాగీతం వందేమాతరం తో కార్యక్రమాలు ప్రారంభమైయాయి. సుబ్రహ్మణ్య శర్మ పంచాజ్గ పఠనం చేసారు.
అనంతరం జరిగిన సాంస్క్రుతిక కార్యక్రమాలలో మ్యూజిక్ ఇండియా దుబాయ్ వారి సహకారం తో ప్రముఖ సినీ నేపధ్య గాయకుల జోడి హేమచంద్ర మరియు శ్రావణ భార్గవి పాడిన పాటలు ఆహుతులను ఉర్రూతలూగించాయి. చిన్నారుల కూచిపూడి, మరియు సినిమా నృత్యాలు అందరినీ మంత్రముగ్ధులను లను చేసాయి.
యు.ఎ.ఇ లోని సుమారు 1000 మంది తెలుగువారు ఉగాది పచ్చడి, విందు భోజనం, ఆటలు, పాటలు మరియు ఇతర వినోద కార్యక్రమాలతో నూతన సంవత్సరానికి ఉత్సాహంగా ఆహ్వనం పలికారు.
అనేక వందల తెలుగు వారికి ఉద్యోగ అవకాశాలు కల్పించి , తెలుగు ప్రజలకు విశేష సేవలు అందిస్తున్న ప్రముఖ పారిశ్రామికవేత్త గోరంట్ల రామరాజ్ ని "ప్రవాసి తెలుగు మిత్ర" ఉగాది పురస్కారంతో తెలుగు తరంగిణి సత్కరించింది.
అధ్యక్షులు వక్కలగడ్డ వెంకట సురేష్, ఉపాద్యక్షులు సాయి కృష్ణ మోహన్ ముసునూరి, కార్యదర్శులు కోకా సత్యానంద రావు, చామర్తి రాజేష్ ల ఆర్ధ్వర్యంలో తెలుగు తరంగిణి సభ్యులు రవిశంకర్, మూర్తి, వేణుగోపాల్, రామశేషు, వెంకి, శివానంద్,సైదా, కిరణ్, మొహమ్మద్ సులేమాన్ మరియు ఇతర కార్యవర్గ సభ్యులు కార్యక్రమ నిర్వహణా బాధ్యతలు చూసుకున్నారు.
కార్యక్రమానికి వ్యాఖ్యాతలుగా వ్యవహరించిన వలేది సుజన్, ముసునూరి గౌరీ మైథిలి ల వ్యాఖ్యానం అందరినీ ఆకట్టుకుంది. దువ్వురి కిషోర్ బాబు, దీపిక కిషోర్ బాబు, శ్రీనివాస్, సుదర్శన్, గోపీనాథ్, బి. సత్యనారాయణ చిన్నారులను ఆశీర్వదించి ప్రశంసా పత్రం మరియు బహుమతి ప్రదానం చేసారు.
భారత జాతీయ గీతం జన గణ మణ తో కార్యక్రమాలు ముగిసాయి.రస్ అల్ ఖైమాలో జరిగిన ఈ కార్యక్రమానికి మాగల్ఫ్, TV5, SVBC మీడియా సహకారం అందించారు.





తాజా వార్తలు
- RBVRR పోలీస్ అకాడమీలో ప్రొబేషనరీ డిప్యూటీ సూపరింటెండెంట్స్ శిక్షణ ప్రారంభం
- 80వేల వీసాలను రద్దు చేసిన డొనాల్డ్ ట్రంప్
- వర్జీనియా లెఫ్టినెంట్ గవర్నర్గా ఎన్నికైన తొలి భారతీయ ముస్లిం మహిళ
- ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ముఖ్య గమనిక..
- WPL 2026 రిటెన్షన్ లిస్ట్ ఇదే..
- టీ20 ప్రపంచకప్ ఫైనల్కు వేదిక ఖరారు..!
- తెలంగాణలో కొత్తగా మూడు టీటీడీ దేవాలయాలు: టీటీడీ ఛైర్మన్
- స్పీడ్మాక్స్ సైకిళ్లను కొనవద్దు..CPA హెచ్చరిక..!!
- దుబాయ్ లో త్వరలో కొత్త వాటర్పార్క్..!!
- బహ్రెయిన్ లో ముగిసిన కొత్త సీజన్ కు రిజిస్ట్రేషన్లు..!!







