భారత్‌కు చేరుకోనున్న 38 మంది మృతదేహాలు
- April 01, 2018
న్యూఢిల్లీ : ఇరాక్‌లోని మోసుల్‌లో మృతి చెందిన 39 మంది భారతీయుల్లో 38 మంది మృతదేహాలు సోమవారం రాత్రికి భారత్‌కు చేరుకోవచ్చు. వీటిని ఇక్కడకు తరలించడానికి విదేశీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి వి.కె. సింగ్ ఆదివారం మోసుల్ చేరుకున్నారు. మృతి చెందిన వారిలో ఓ వ్యక్తి కేసు పెండింగ్‌లో ఉండటం వల్ల అతని మృతదేహాన్ని తీసుకురావడం లేదని తెలిపారు. మృతదేహాలు భారత్‌కు చేరుకున్న అనంతరం అమృత్సర్, పాట్నాలో ఉన్న బాధితుల కుటుంబ సభ్యులకు ఇవ్వనున్నారు. ఇరాక్‌లో తప్పిపోయిన 39 భారతీయుల్ని ఉగ్రవాద సంస్థ ఇస్లామిక్ స్టేట్ హత్య చేసిన సంఘటనపై గతనెల 20న విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి సుష్మా స్వరాజ్ రాజ్యసభలో వెల్లడించిన సంగతి తెలిసిందే.
తాజా వార్తలు
- అయ్యప్ప భక్తులకు శుభవార్త..60 స్పెషల్ రైళ్లు
- పేటీఎం నుంచి ట్రావెల్ బుకింగ్ యాప్
- ‘వందే మాతరానికి’ 150 ఏళ్లు
- కువైట్ ఉప ప్రధానమంత్రిని కలిసిన కేరళ సీఎం..!!
- Dh100 మిలియన్ యూఏఈ లాటరీ విజేత ఫ్యూచర్ ప్లాన్ రివీల్..!!
- గ్రేస్ పీరియడ్‌ను సద్వినియోగం చేసుకోవాలని ఒమన్ పిలుపు..!!
- సౌదీయేతరుల ఆస్తులపై కీలక అప్డేట్..!!
- ఖతార్ లో 25.1% పెరిగిన రెంటల్ కాంట్రాక్టులు..!!
- జీసీసీలో బహ్రెయిన్, ఖతార్ తొలి సముద్ర లింక్ ప్రారంభం..!!
- RBVRR పోలీస్ అకాడమీలో ప్రొబేషనరీ డిప్యూటీ సూపరింటెండెంట్స్ శిక్షణ ప్రారంభం







