దుబాయ్‌లో తెలంగాణ వాసి ఆత్మహత్య
- April 01, 2018
దుబాయ్:దుబాయ్ లో తెలంగాణకు చెందిన జగిత్యాల వాసి ఆత్మహత్య. కుటుంబ బాధ్యతలను తలపై వేసుకున్నాడు. సంపాదన కోసం పరాయి దేశం వెళ్లాడు. ఏమైందో తెలీదు ఉన్నట్టుండి బలవన్మరాణానికి పాల్పడ్డాడు.. వివరాల్లోకి వెళ్తే.. కథలాపూర్‌కు మండలం గంభీర్‌పూర్ గ్రామానికి చెందిన సంకు దయానంద్ అనే యువకుడు దుబాయ్‌లో ఆదివారం ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుడు దుబాయ్‌లో ఫోటో గ్రాఫర్‌గా పనిచేస్తున్నాడు. నాలుగు నెలల క్రితమే స్వగ్రమానికి వచ్చి తిరిగి దుబాయ్ వెళ్లిపోయాడు. ఏమైందో ఏమో ఆదివారం తన రూమ్‌లోనే ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కాగా తండ్రి సైతం ఉపాధి కోసం దుబాయ్‌లేనే ఉంటున్నాడు. ఈమేరకు దయానంద్ మృతిపై కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. ఒత్తిడి, ఇంటిపై దిగులు కారణంగానే ఆత్మహత్య చేసుకున్నట్లు భావిస్తున్నారు.రమేష్ తుమ్మా(ఫోటోగ్రాఫర్) మాగల్ఫ్.కామ్కు మృతుని వివరాలు తెలియజేసారు.
తాజా వార్తలు
- RBVRR పోలీస్ అకాడమీలో ప్రొబేషనరీ డిప్యూటీ సూపరింటెండెంట్స్ శిక్షణ ప్రారంభం
- 80వేల వీసాలను రద్దు చేసిన డొనాల్డ్ ట్రంప్
- వర్జీనియా లెఫ్టినెంట్ గవర్నర్‌గా ఎన్నికైన తొలి భారతీయ ముస్లిం మహిళ
- ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ముఖ్య గమనిక..
- WPL 2026 రిటెన్షన్ లిస్ట్ ఇదే..
- టీ20 ప్రపంచకప్ ఫైనల్‌కు వేదిక ఖరారు..!
- తెలంగాణలో కొత్తగా మూడు టీటీడీ దేవాలయాలు: టీటీడీ ఛైర్మన్
- స్పీడ్‌మాక్స్ సైకిళ్లను కొనవద్దు..CPA హెచ్చరిక..!!
- దుబాయ్ లో త్వరలో కొత్త వాటర్‌పార్క్..!!
- బహ్రెయిన్ లో ముగిసిన కొత్త సీజన్ కు రిజిస్ట్రేషన్లు..!!







