గుడ్‌ కండక్ట్‌ సర్టిఫికెట్‌ని సస్పెండ్‌ చేసిన యూఏఈ

- April 01, 2018 , by Maagulf
గుడ్‌ కండక్ట్‌ సర్టిఫికెట్‌ని సస్పెండ్‌ చేసిన యూఏఈ

ఫిబ్రవరి 4న గుడ్‌ కండక్ట్‌ సర్టిఫికెట్‌ విషయమై జారీ చేసిన ఆదేశాల్ని, యూఏఈ ప్రభుత్వం వెనక్కి తీసుకుంది. ఈ నిర్ణయం ఏప్రిల్‌ 1 నుంచి అమల్లోకి వచ్చింది. యూఏఈకి ఉద్యోగ నిమిత్తం వచ్చేవారు తమ స్వదేశం నుంచి పోలీస్‌ ద్వారా గుడ్‌ కండక్ట్‌ సర్టిఫికెట్‌ తీసుకురావడం తప్పనిసరి అని ఫిబ్రవరి 4న దానికి సంబంధించిన ఆదేశాలు జారీ చేసిన సంగతి తెల్సిందే. అయితే ఈ విధానంపై విమర్శలు రావడం, అనేక అనుమానాలు తలెత్తడంతో యూఏఈ ప్రభుత్వం 'సస్పెండ్‌' నిర్ణయం తీసుకుంది. గుడ్‌ కండక్ట్‌ సర్టిఫికెట్‌ తప్పనిసరి నిర్ణయం పోస్ట్‌పోన్‌ అయ్యిందనీ, తదుపరి నోటీసు వచ్చేదాకా ఈ నిర్ణయం అమల్లో వుంటుందని మినిస్ట్రీ ట్విట్టర్‌ ద్వారా పేర్కొంది. కొత్త రూల్‌కి సంబంధించి ఎంబసీలు తీవ్ర గందరగోళంలో పడ్డాయి. ఈ విషయాన్ని ఎంబసీలు, యూఏఈ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళాయి. దాంతో యూఏఈ ప్రభుత్వం గుడ్‌ కండక్ట్‌ సర్టిఫికెట్‌ తప్పనిసరి నిర్ణయాన్ని పోస్ట్‌పోన్‌ చేసినట్లు తెలుస్తోంది.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com