కొనసాగుతున్న భారత్‌ బంద్‌ !

- April 01, 2018 , by Maagulf
కొనసాగుతున్న భారత్‌ బంద్‌ !

ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టంపై సుప్రీం తన ఆదేశాలను వెనక్కు తీసుకోవాలంటూ దళిత సంఘాలు భారత్ బంద్‌కు పిలుపునిచ్చాయి. దీంతో బీహార్, పంజాబ్‌, యూపీ, ఒడిషాలో ఉదయం నుంచే ఆందోళనలు మొదలయ్యాయి. గుంపులుగా రోడ్లపైకి వచ్చిన దళిత సంఘాలు బలవంతంగా షాపులు మూయించారు. 

పంజాబ్‌లో లుథియానా, జిర్కాపూర్ ఇంకా చాలా ప్రాంతాల్లో రోడ్లు నిర్మానుష్యం అయ్యాయి. బంద్ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరక్కుండా భారీగా బలగాలను మోహరించారు. రోడ్లపైకి వచ్చిన ఆందోళనకారులు సుప్రీంకోర్టుకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ నిరసనలకు దిగారు. 

పాట్నాలో జన అధికార్ పార్టీ నేత పప్పూయాదవ్ దళిత సంఘాలకు మద్దతు ప్రకటించారు. తన కార్యకర్తలతో సహా రోడ్డుపైకి వచ్చి భారీ ర్యాలీ చేశారు. దళిత సంఘాలతో కలిసి రాస్తారోకో, రైల్ రోకో చేశారు. భారత్ బంద్ కారణంగా చాలా ప్రాంతాల్లో రైలు సేవలకు అంతరాయం ఏర్పడింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com