ఎమిరేట్స్‌ విమానంలోని సలాడ్ లో బొద్దింక..రూ.87 లక్షలు డిమాండ్

ఎమిరేట్స్‌ విమానంలోని సలాడ్ లో బొద్దింక..రూ.87 లక్షలు డిమాండ్

సలాడ్ లో బొద్దింక పడిందని రూ.87 లక్షలు డిమాండ్ చేశాడు ఓ ప్రయాణికుడు. ముంబయికి చెందిన యూసఫ్‌ ఇక్బాల్‌ అనే న్యాయవాది ఫిబ్రవరి 27న మొరాకో నుంచి ముంబయికి ఎమిరేట్స్‌ విమానంలో ప్రయాణిస్తున్నాడు. తనకు విమాన సిబ్బంది అందించిన చికెన్‌ సలాడ్‌లో బొద్దింక ఉండటాన్నిచూసి అతను ఒక్కసారి షాక్‌కు గురయ్యాడు. ఈ ఘటన కారణంగా తాను మానసికంగా, ఆర్థికంగా ఎంతో నష్టపోయానని.. రూ.87 లక్షలు నష్టపరిహారంగా చెల్లించాలని డిమాండ్ చేశాడు. దీనిపై స్పందించిన ఎమిరేట్స్‌ ఎయిర్‌లైన్‌ ప్రతినిధులు విమానంలోకి బొద్ధింక ఎలా చేరిందో అర్థంకావడం లేదు' అని తెలిపారు.

Back to Top