విశాఖలో 6 నుంచి షురూ కానున్న శర్వానంద్‌ కొత్త మూవీ షూటింగ్‌

- April 02, 2018 , by Maagulf
విశాఖలో 6 నుంచి షురూ కానున్న శర్వానంద్‌ కొత్త మూవీ షూటింగ్‌

విశాఖ : యంగ్‌ హీరో శర్వానంద్‌ కేశవ ఫేమ్‌ సుధీర్‌ వర్మతో చేస్తున్న ప్రస్తుత మూవీ షూటింగ్‌ ఈనెల ఆరు నుంచి విశాఖలో మొదలు కానుంది. ఇందులో శర్వానంద్‌ డాన్‌ పాత్రలో కనిపించనున్నాడు. ఆ తరువాత షెడ్యూల్స్‌ను కాకినాడ, హైదరాబాద్‌లలో ప్లాన్‌ చేశారు. ఇంతవరకూ శర్వానంద్‌ చేసిన సినిమాల్లో ఎక్కువ బడ్జెట్‌తో రూపొందుతోన్న సినిమా ఇదే. ఈ సినిమా కోసం 20 కోట్లకి పైగా ఖర్చు చేయనున్నారు. ఈ మూవీలో శర్వాకు జోడీగా కళ్యాణి ప్రియదర్శిని నటిస్తున్నది. ప్రశాంత్‌ పిళ్ళ్కె సంగీతం అందిస్తున్నారు. దివాకర్‌ మణి సినిమాటోగ్రఫి అందిస్తున్నారు. సితార ఎంటర్టైన్మెంట్‌ సంస్థలో సూర్యదేవర నాగవంశీ ఈ సినిమాను నిర్మిస్తున్నాడు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com