సమయం పడుతుంది అంటున్న ఫేస్ బుక్ అధినేత
- April 03, 2018
ఫేస్ బుక్ లో సమస్యలను సరిచేయడానికి కొన్నేళ్లు పడుతుందని ఆ సంస్థ చీఫ్ మార్క్ జకెర్ బర్గ్ అన్నారు. ఫేస్ బుక్ లో లక్షలాది మంది యూజర్ల సమాచారాన్ని కేంబ్రిడ్జ్ అనలైటికా అనే కంపెనీ చోరీ చేయడం, దీనిపై అన్ని వర్గాల నుంచి ఫేస్ బుక్ తీవ్ర విమర్శలు ఎదుర్కోవడం తెలిసిందే. ఇందుకు ఆ సంస్థ క్షమాపణలు కూడా చెప్పింది. పలు కోర్టుల్లో వ్యాజ్యాలు కూడా దాఖలయ్యాయి. ఈ నేపథ్యంలో వోక్స్ అనే మీడియా సంస్థతో జుకెర్ బర్గ్ మాట్లాడారు. ''ఈ లోపాలను సవరించగలం. కానీ కొన్నేళ్ల సమయం పడుతుంది. ఈ సమస్యలను మూడు లేదా ఆరు నెలల్లోపే సరిచేయాలని నేను కోరుకుంటున్నాను. కానీ, వాస్తవం ఏమిటంటే ఇంతకంటే ఎక్కువ సమయమే పడుతుంది'' అని జుకెర్ బర్గ్ చెప్పారు.
తాజా వార్తలు
- RBVRR పోలీస్ అకాడమీలో ప్రొబేషనరీ డిప్యూటీ సూపరింటెండెంట్స్ శిక్షణ ప్రారంభం
- 80వేల వీసాలను రద్దు చేసిన డొనాల్డ్ ట్రంప్
- వర్జీనియా లెఫ్టినెంట్ గవర్నర్గా ఎన్నికైన తొలి భారతీయ ముస్లిం మహిళ
- ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ముఖ్య గమనిక..
- WPL 2026 రిటెన్షన్ లిస్ట్ ఇదే..
- టీ20 ప్రపంచకప్ ఫైనల్కు వేదిక ఖరారు..!
- తెలంగాణలో కొత్తగా మూడు టీటీడీ దేవాలయాలు: టీటీడీ ఛైర్మన్
- స్పీడ్మాక్స్ సైకిళ్లను కొనవద్దు..CPA హెచ్చరిక..!!
- దుబాయ్ లో త్వరలో కొత్త వాటర్పార్క్..!!
- బహ్రెయిన్ లో ముగిసిన కొత్త సీజన్ కు రిజిస్ట్రేషన్లు..!!







