రివ్యూ పిటిషన్ విచారణకు సుప్రీం ఓకే
- April 03, 2018
న్యూఢిల్లీ: ఎస్సీ ఎస్టీ చట్టం అమలులో సవరణలు చేస్తూ ఇచ్చిన తీర్పుపై కేంద్రం దాఖలు చేసిన రివ్యూ పిటిషన్‌ను విచారించేందుకు సుప్రీంకోర్టు అంగీకరించింది. ఇవాళ మధ్యాహ్నం 2 గంటలకు ఓపెన్ కోర్టులో దీనిపై విచారణ చేపట్టనున్నారు. ఎస్సీ, ఎస్టీ వేధింపుల నిరోధక చట్టం కింద తక్షణ అరెస్టుల నుంచి రక్షణ కల్పిస్తూ సుప్రీకోర్టు గత నెల 20న తీర్పు వెలువరించిన సంగతి తెలిసిందే. దీంతో ఈ చట్టాన్ని నిర్వీర్యం చేస్తున్నారంటూ దేశ వ్యాప్తంగా దళితులు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. దళిత సంఘాలు చేపట్టిన భారత్ బంద్ హింసాత్మకంగా మారింది. పలురాష్ట్రాల్లో చోటు చేసుకున్న ఘర్షణల్లో దాదాపు 9 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో కేంద్ర ప్రభుత్వం దిగివచ్చి సోమవారం హుటాహుటిన సుప్రీం తీర్పుపై రివ్యూ పిటిషన్ దాఖలు చేసింది. ఎస్సీ ఎస్టీ వేధింపుల నిరోధక చట్టం-1989 లోని ఏ నిబంధనలను సడలించినా రాజ్యాంగంలోని 21వ అధికరణాన్ని ఉల్లంఘించడమేనని కేంద్ర ప్రభుత్వం వాదించింది.
దేశంలో కొనసాగుతున్న హింస కారణంగా అత్యవసర పరిస్థితి వాతవరణం కనిపిస్తోందనీ.. ఓపెన్ కోర్టులో దీనిపై వెంటనే విచారణ చేపట్టాలని ఇవాళ అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్ సుప్రీంకోర్టుకు విన్నవించారు. దీనిపై స్పందించిన భారత ప్రధాన న్యాయమూర్తి దీపక్ మిశ్రా... జస్టిస్ ఏకే గోయల్, జస్టిస్ యూయూ లలిత్‌లతో కూడిన ధర్మాసనాన్ని ఏర్పాటు చేశారు. ఇవాళ మధ్యాహ్నం 2 గంటలకు రివ్యూ పిటిషన్‌పై విచారణ జరగనుంది. కాగా సుప్రీం తీర్పునకు వ్యతిరేకంగా నిన్న అఖిల భారత ఎస్సీ ఎస్టీ సంఘాల సమాఖ్య దాఖలు చేసిన పిటిషన్‌పై అత్యవసర విచారణ చేపట్టేందుకు సుప్రీం తిరస్కరించిన సంగతి తెలిసిందే.
తాజా వార్తలు
- RBVRR పోలీస్ అకాడమీలో ప్రొబేషనరీ డిప్యూటీ సూపరింటెండెంట్స్ శిక్షణ ప్రారంభం
- 80వేల వీసాలను రద్దు చేసిన డొనాల్డ్ ట్రంప్
- వర్జీనియా లెఫ్టినెంట్ గవర్నర్‌గా ఎన్నికైన తొలి భారతీయ ముస్లిం మహిళ
- ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ముఖ్య గమనిక..
- WPL 2026 రిటెన్షన్ లిస్ట్ ఇదే..
- టీ20 ప్రపంచకప్ ఫైనల్‌కు వేదిక ఖరారు..!
- తెలంగాణలో కొత్తగా మూడు టీటీడీ దేవాలయాలు: టీటీడీ ఛైర్మన్
- స్పీడ్‌మాక్స్ సైకిళ్లను కొనవద్దు..CPA హెచ్చరిక..!!
- దుబాయ్ లో త్వరలో కొత్త వాటర్‌పార్క్..!!
- బహ్రెయిన్ లో ముగిసిన కొత్త సీజన్ కు రిజిస్ట్రేషన్లు..!!







