ఎలివేటర్‌లో చిక్కుకున్న బాలికల్ని రక్షించిన పోలీసులు
- April 03, 2018
దుబాయ్ పోలీసులు, నలుగురు టీనేజర్స్‌ని దుబాయ్‌లోని ఓ మాల్‌లో రక్షించారు. వీరంతా ఎలివేటర్‌లో చిక్కుకుపోగా, పోలీసులు చాకచక్యంగా వ్యవహరించారు. అలాగే ఓ భవనం 9వ అంతస్తు నుంచి వెంటిలేషన్ హోల్‌లో పడిపోయిన ఓ వ్యక్తిని కూడా రక్షించారు. ఎలివేటర్ ప్రమాద ఘటన విషయానికొస్తే, 45 నిమిషాలపాటు బాలికలు ఎలివేటర్‌లో చిక్కుకుపోయారు. జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ ఆపరేషన్స్, క్రైసిస్ అండ్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ యాక్టింగ్ డైరెక్టర్ లెఫ్టినెంట్ కల్నల్ అహ్మద్ బౌర్‌గుయిబా మాట్లాడుతూ, రెస్క్యూ టీమ్స్, ఎలివేటర్‌లో చిక్కుకుని ఆందోళన చెందుతున్న బాలికలకు ధైర్యం చెప్పి, అత్యంత సాహసోపేతంగా వారిని రక్షించారని అన్నారు. ఇంకో ఘటన గురించి మాట్లాడుతూ బౌర్‌గుయిబా, 23 ఏళ్ళ వ్యక్తిని రక్షించామనీ, పైనుంచి కింద పడ్డంతో ఆ వ్యక్తికి గాయాలు కావడంతో, వెంటనే ఆసుపత్రికి తరలించామనీ అన్నారు. క్విక్ రెస్పాన్స్ టీమ్స్ సకాలంలో బాధితులకు మెరుగైన సహాయం అందిస్తున్నట్లు చెప్పారాయన.
తాజా వార్తలు
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!
- బహ్రెయిన్‌లో మైనర్లకు వేప్ విక్రయిస్తే BD1,000 జరిమానా..!!
- ఖతార్–భారత్ మధ్య ఆరో విడత రాజకీయ సంప్రదింపులు..!!
- గుల్మార్గ్లో ఎంపీ బాలశౌరి నేతృత్వంలో కమిటీ సమావేశం
- యూఏఈలో హత్య కేసుల్లో కిసాస్ మినహాయింపు పై కొత్త శిక్షలు..
- అమెజాన్‌లో రికార్డు స్థాయి అమ్మకాలు..
- CJP అధ్యక్షుడు అభిజీత్ దీప్కే అరెస్ట్
- తిరుమలలో మరోసారి బ్రహ్మోత్సవాల సందడి
- ‘RTC’ ఎన్నికల్లో EU కూటమి విజయం!
- లుసైల్ బౌలేవార్డ్పై నేడు ట్రాఫిక్ ఆంక్షలు..!!







