ఈ పరిస్థితి గుండె పోటు లా ఉంది: ఇస్రో అధికారి

- April 03, 2018 , by Maagulf
ఈ పరిస్థితి గుండె పోటు లా ఉంది: ఇస్రో అధికారి

మూడు రోజులు గడుస్తున్నప్పటికీ జీశాట్‌-6ఏ ఉప గ్రహం నుంచి ఎలాంటి సమాచారం లేకపోవడం గుండె పోటు వచ్చినట్లు ఉందని ఇస్రో అధికారి ఒకరు వ్యాఖ్యానించారు. రూ.270 కోట్ల ఖరీదైన ఈ శాటిలైట్‌ను ప్రయోగిస్తే చివరగా ఇలా జరగడం బాధగా ఉందన్నారు. గతంలో ఉప గ్రహాలు ప్రయోగించినప్పుడు సమస్యలు తలెత్తితే ముందస్తు సూచనలు వచ్చేవన్నారు. కానీ ఈ సారి మాత్రం ఉపగ్రహం ఎలాంటి సూచనలు లేకుండా ఇస్రోతో సంబంధాలు కోల్పోయిందని తెలిపారు. అందుకే దాన్ని కనుగొనేందుకు మరింత సమయం పడుతోందని పేర్కొన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com