ఫేక్ బాంబ్: నిందితుడికి మూడేళ్ళ జైలు
- April 03, 2018
ప్రజల్ని భయభ్రాంతులకు గురిచేయాలన్న ఉద్దేశ్యంతో ఫేక్ బాంబ్‌ని తయారుచేసి, దాన్ని ఓ పబ్లిక్ ప్లేస్‌లో పెట్టినందుకుగాను నిందితుడికి మూడేళ్ళ జైలు శిక్షను విధించింది ఫోర్త్ హై క్రిమినల్ కోర్ట్. 2015లో ఈ ఘటన జరిగింది. నల్లటి బ్యాగ్‌లో, ఓ ప్లాస్టిక్ కంటెయినర్‌ని వుంచి, దాన్ని బాంబులా తీర్చిదిద్ది, అదనంగా ఎలక్ట్రానిక్ వైర్లు తగిలించి తుబ్లిలోని ఓ బ్యాకరీలో డిసెంబర్ 5, 2015న నిందితుడు ఆ బ్యాగ్‌ని వుంచాడు. దాన్ని బాంబుగా భావించి ప్రజలు ఆందోళన చెందారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని, ఆ బ్యాగ్‌ని తమతో తీసుకెళ్ళి, పరీక్షలు నిర్వహించి అది ఫేక్ అని తేల్చారు. విచారణలో నిందితుడు నేరాన్ని అంగీకరించాడు. నిందితుడికి 18 ఏళ్ళ వయసు కావడంతో, కేవలం మూడేళ్ళ శిక్షతో సరిపెడ్తున్నట్లు న్యాయమూర్తులు వెల్లడించారు.
తాజా వార్తలు
- RBVRR పోలీస్ అకాడమీలో ప్రొబేషనరీ డిప్యూటీ సూపరింటెండెంట్స్ శిక్షణ ప్రారంభం
- 80వేల వీసాలను రద్దు చేసిన డొనాల్డ్ ట్రంప్
- వర్జీనియా లెఫ్టినెంట్ గవర్నర్‌గా ఎన్నికైన తొలి భారతీయ ముస్లిం మహిళ
- ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ముఖ్య గమనిక..
- WPL 2026 రిటెన్షన్ లిస్ట్ ఇదే..
- టీ20 ప్రపంచకప్ ఫైనల్‌కు వేదిక ఖరారు..!
- తెలంగాణలో కొత్తగా మూడు టీటీడీ దేవాలయాలు: టీటీడీ ఛైర్మన్
- స్పీడ్‌మాక్స్ సైకిళ్లను కొనవద్దు..CPA హెచ్చరిక..!!
- దుబాయ్ లో త్వరలో కొత్త వాటర్‌పార్క్..!!
- బహ్రెయిన్ లో ముగిసిన కొత్త సీజన్ కు రిజిస్ట్రేషన్లు..!!







