ఈ నెల 12 నుంచి హైదరాబాద్‌ ఫెస్ట్‌-2018

- April 03, 2018 , by Maagulf
ఈ నెల 12 నుంచి హైదరాబాద్‌ ఫెస్ట్‌-2018

హైదరాబాద్‌ : హైదరాబాద్‌ ఫెస్ట్‌-2018ను ఏప్రిల్‌ 12 నుంచి 22వ తేదీ వరకు ఎన్టీఆర్‌ స్టేడియంలో నిర్వహించనున్నట్టు అధ్యక్ష, కార్యదర్శులు నంద్యాల నరసింహరెడ్డి, కె చంద్రమోహన్‌లు తెలిపారు. ఈ వేడుకల్లో సాంస్కృతిక కార్యక్రమాలు, ఆర్ట్‌ గ్యాలరీ, సైన్స్‌ ఫెయిర్‌, ఫిల్మ్‌ ఫెస్టివల్‌, షార్ట్‌ ఫిల్మ్‌, ఫొటోగ్రఫీ పోటీలతో పాటు పలు కార్యక్రమాలు నిర్వహించనున్నట్టు పేర్కొన్నారు. ఫెస్ట్‌కు హాజరయ్యేవారిని ఆకట్టుకునేలా ప్రతిరోజు కళా ప్రదర్శనలు, ప్రముఖుల కవితలు, ఉపన్యాసాలను ఏర్పాటు చేస్తామన్నారు.

విద్యార్థుల్లోని ప్రతిభను, సృజనాత్మకతను వెలికితీసేలా సైన్స్‌ ఎగ్జిబిషన్‌ చేపడుతున్నట్టు ఫెస్ట్‌ నిర్వహకులు తెలిపారు. అంతే కాకుండా విద్యార్థులకు కథలు, కవితల పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు అందజేస్తామన్నారు. హైదరాబాద్‌ చరిత్ర ప్రతిబింబించే అంశాలతో పాటు, తెలంగాణ కళలను ప్రోత్సహించే దిశగా ఫెస్ట్‌ని నిర్వహిస్తున్నట్టు పేర్కొన్నారు. ఐదు లక్షల మందికి పైగా ఫెస్ట్‌కు హాజరవుతారని, ప్రజలు దీనిని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com