భరత్ భహిరంగ సభకు విచ్చేయనున్న 'రామ్' లు
- April 03, 2018
మరో నాలుగు రోజుల్లో భరత్ అను నేను సినిమా ఆడియో రిలీజ్ ఎల్బీ స్టేడియంలో భారీ ఎత్తున నిర్వహించబోతున్నారు. అయితే ఈ సినిమా కు గెస్ట్ లు గా ఎన్టీఆర్ ని మరియు చరణ్ ను ఆహ్వానించారు అంటా. తన సినిమా ప్రమోషన్స్ కు పొలిటికల్ టచ్ ఇస్తూ పేర్లు పెడుతున్న కొరటాల శివ.. ఈ ప్రీ-రిలీజ్ ఫంక్షన్ కు 'భరత్ బహిరంగ సభ' అనే పేరు ఫిక్స్ చేశాడు. అయితే ఒక పెద్ద హీరో సినిమా కు ఇంకొక పెద్ద హీరో లు రావడం అనేది అరుదు అని చెప్పాలి.
పైగా అది ఇద్దరు హీరోలు రావడం అనేది నిజంగానే అభిమానులకు కన్నుల పండుగ గా చెప్పవచ్చు. ఈ మేరకు ఇప్పటికే ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి. మహేష్ బాబు స్వయంగా ఎన్టీఆర్ కు ఫోన్ చేసి, ఫంక్షన్ కు రావాల్సిందిగా కోరాడట. దీనికి ఎన్టీఆర్ వెంటనే ఓకే చెప్పినట్టు తెలుస్తోంది. మరోవైపు రామ్ చరణ్ ను కూడా ఈ ఫంక్షన్ కు తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ మేరకు మహేష్ భార్య నమ్రతా శిరోద్కర్ ప్రత్యేకంగా చరణ్ ను కలిశారు.
రంగస్థలం సక్సెస్ అయినందుకు చెర్రీకి ఓ స్పెషల్ గిఫ్ట్ అందిస్తూనే, భరత్ అనే నేను ప్రీ-రిలీజ్ ఫంక్షన్ కు రావాల్సిందిగా కోరారు. దీనికి చరణ్ కూడా ఓకే చేసినట్టు తెలుస్తోంది. స్వతహాగా ఫ్రెండ్స్ అయిన చరణ్, ఎన్టీఆర్ ఒకే వేదికపై కలవడానికి పెద్దగా ఇబ్బంది ఉండదు. మరీ ముఖ్యంగా వీళ్లిద్దరూ కలిసి త్వరలోనే రాజమౌళి దర్శకత్వంలో సినిమా కూడా చేయబోతున్నారు. సో.. ఈ శనివారం ఒకే వేదికపై మహేష్, చరణ్, ఎన్టీఆర్ ను చూడబోతున్నామన్నమాట.
తాజా వార్తలు
- WPL 2026 రిటెన్షన్ లిస్ట్ ఇదే..
- టీ20 ప్రపంచకప్ ఫైనల్కు వేదిక ఖరారు..!
- తెలంగాణలో కొత్తగా మూడు టీటీడీ దేవాలయాలు: టీటీడీ ఛైర్మన్
- స్పీడ్మాక్స్ సైకిళ్లను కొనవద్దు..CPA హెచ్చరిక..!!
- దుబాయ్ లో త్వరలో కొత్త వాటర్పార్క్..!!
- బహ్రెయిన్ లో ముగిసిన కొత్త సీజన్ కు రిజిస్ట్రేషన్లు..!!
- కువైట్ లో 28 ఏళ్ల తర్వాత కేరళ సీం విజయన్..!!
- మదీనాలో ఇద్దరు మహిళలు సహా ముగ్గురు అరెస్ట్..!!
- ఖతార్ లో సీజనల్ వెజిటేబుల్ మార్కెట్లు ప్రారంభం..!!
- ఫోన్ చార్జర్ వాడకంపై ప్రభుత్వం సూచనలు







