రాజమౌళి కి బ్రహ్మరధం పట్టిన పాకిస్తాన్

- April 04, 2018 , by Maagulf
రాజమౌళి కి బ్రహ్మరధం పట్టిన పాకిస్తాన్

'బాహుబలి' మూవీతో అంతర్జాతీయ ఖ్యాతిని అందుకున్న రాజమౌళి క్రేజ్ ప్రపంచ వ్యాప్తంగా ఉంది. అయితే మన దక్షిణాది సినిమాలను అధికారికంగా పాకిస్తాన్ లో ప్రదర్శింప చేయడానికి అక్కడ అనుమతులు లభించవు. ఇండియాపట్ల విపరీతమైన ద్వేషంతో అనుక్షణం రగిలిపోయే పాకిస్తాన్ దేశానికి రాజమౌళి వెళ్ళడం ఒకసంచలనం అయితే అక్కడ జక్కన్న మాట్లాడిన మాటలకు పాకిస్తాన్ మీడియా ప్రశంసలు కురిపించడం మీడియాకు హాట్ టాపిక్ గా మారింది.

 
ఇప్పటివరకు ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో అంతర్జాతీయ ఫిలిం ఫెస్టివల్స్ కు వెళ్ళిన రాజమౌళిని ఈమధ్య పాక్ లో జరిగిన అంతర్జాతీయ ఫిలిం ఫెస్టివల్ కు అతిధిగా పిలిచారు. ఈవార్త వచ్చిన మరుక్షణమే మీడియాకు హాట్ టాపిక్ గా మారినవిషయం తెలిసిందే. ఆశ్చర్యకరంగా ఎవరు ఊహించని విధంగా పాకిస్తాన్ లో రాజమౌళికి రాచమర్యాదలు జరిగాయి. ఎంతోమంది ప్రముఖు నటీనటులు పాల్గొన్న రాజమౌళిని పాక్ మీడియా ఒక ఊహించని ప్రశ్న అడిగి ఇరుకున పెట్టడానికి ప్రయత్నించింది.

 
'పాకిస్థాన్ మీద మీఅభిప్రాయం ఏమిటి ? అని అక్కడ మీడియా అడిగిన ప్రశ్నకు సమాధానం ఇస్తూ 'పాకిస్థాన్ అంటే చిన్నప్పటి నుంచి మాకు ఎనిమీస్ శత్రువులుగా చూసేవాళ్ళం. బిగ్గెస్ట్ శత్రువు వసిమ్ అక్రమ్. కానీ పెద్దయ్యాక ఎంతో మార్పు వచ్చింది. అందరం ఒకేరకమైన మనుషులమని అందరి భావోద్వేగాలు ఒకేలా ఉంటాయని నాకు తెలిసింది' అని కామెంట్ చేసాడు. ఈమాటలు వినగానే పాక్ అంతర్జాతీయ ఫిలిం ఫెస్టివల్ కు వచ్చిన అతిధులు అంతా రాజమౌళి మాట్లాడిన తీరుకు లేచి చప్పట్లు కొట్టారు అని వార్తలు వస్తున్నాయి.

ఇది ఇలా ఉండగా ఈ ఫిలిం ఫెస్టివల్ కు అతిధిగా వచ్చిన రాజమౌళిని కలవడానికి ఆయనతో కలిసి ఫోటోలు తీయించుకోవడానికి పాకిస్తాన్ లో ఎంతోమంది పోటీ పడటం పాక్ మీడియాకు హాట్ న్యూస్ గా మారింది. జక్కన్న కూడా ఎక్కడా తడబడకుండా పాకిస్థాన్ అభిమానులతో చాలా ఆప్యాయంగా పలకరించుకుంటూ వెళ్ళడం చాలామందిని ఆశ్చర్య పరిచింది. దీనికి సంబంధించిన వీడియోలు ఫోటోలు పాక్ మీడియాలోనే కాకుండా ఇండియా మీడియాలో కూడ ప్రస్తుతం వైరల్ గా మారాయి..

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com