వలస విద్యార్థులపై రుసుము: వీగిన ప్రపోజల్
- April 04, 2018
మనామా: పబ్లిక్ స్కూల్స్‌లో చదువుతున్న నాన్ బహ్రెయినీ విద్యార్థులపై ఏడాదికి 400 బహ్రెయినీ దినార్స్ రుసుము విధించాలన్న ప్రపోజల్‌ని హౌస్ ఆఫ్ రిప్రెజెంటేటివ్స్ తిరస్కరించింది. 2015లో తొలిసారిగా ఈ బిల్‌ని ఎంపీ జలాల్ ఖాదిమ్ ప్రతిపాదించారు. జీసీసీ దేశాలకు చెందినవారిని 'వలసదారుల' లిస్ట్ నుంచి మినహాయించాలని కోరుతూ వలసదారులపై రుసుము విధించాలన్నది ఆయన ప్రతిపాదన సారాంశం. ప్రస్తుతం వున్న చట్టాల ప్రకారం ఫండమెంటల్ (ప్రైమరీ మరియు ఇంటర్మీడియట్), సెకెండరీ ఎడ్యుకేషన్ - పబ్లిక్ స్కూల్స్‌లో ఉచితం. బహ్రెయిన్ కింగ్‌డమ్‌లో ఈ చట్టం అమల్లో వుంది. 2015 నుంచి ఈ ఈ బిల్లుని ఎంపీలు వ్యతిరేకిస్తూనే వున్నారు. ప్రతిసారీ చర్చ జరగడం, బిల్లు వీగిపోవడమే జరుగుతోంది. విద్యార్థుల్ని విద్యకు దూరం చేసే ఇలాంటి బిల్లులు సముచితం కావని డాక్టర్ అలి బుఫార్‌సెన్, అబ్దులన హమీద్ అల్ నజ్జార్, మొహమ్మద్ అల్ మారిఫి తదితరులు అభిప్రాయపడ్డారు హౌస్ ఆఫ్ రిప్రెజెంటేటివ్స్‌లో.
తాజా వార్తలు
- RBVRR పోలీస్ అకాడమీలో ప్రొబేషనరీ డిప్యూటీ సూపరింటెండెంట్స్ శిక్షణ ప్రారంభం
- 80వేల వీసాలను రద్దు చేసిన డొనాల్డ్ ట్రంప్
- వర్జీనియా లెఫ్టినెంట్ గవర్నర్‌గా ఎన్నికైన తొలి భారతీయ ముస్లిం మహిళ
- ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ముఖ్య గమనిక..
- WPL 2026 రిటెన్షన్ లిస్ట్ ఇదే..
- టీ20 ప్రపంచకప్ ఫైనల్‌కు వేదిక ఖరారు..!
- తెలంగాణలో కొత్తగా మూడు టీటీడీ దేవాలయాలు: టీటీడీ ఛైర్మన్
- స్పీడ్‌మాక్స్ సైకిళ్లను కొనవద్దు..CPA హెచ్చరిక..!!
- దుబాయ్ లో త్వరలో కొత్త వాటర్‌పార్క్..!!
- బహ్రెయిన్ లో ముగిసిన కొత్త సీజన్ కు రిజిస్ట్రేషన్లు..!!







