మహిళా పోలీసు చెయ్యి కొరికిన రష్యన్‌

- April 04, 2018 , by Maagulf
మహిళా పోలీసు చెయ్యి కొరికిన రష్యన్‌

మద్యం మత్తులో మహిళా కాప్‌ చెయ్యి కొరికిన రష్యాకి చెందిన ఓ మహిళ న్యాయస్థానంలో విచారణను ఎదుర్కొంటోంది. 24 ఏళ్ళ రష్యన్‌ మహిళ, తనను అరెస్ట్‌ చేసేందుకు వచ్చిన మహిళా కాప్‌పై దాడికి దిగింది. ఈ క్రమంలో మహిళా కాప్‌కి గాయాలయ్యాయి. రష్యన్‌ మహిళ, మహిళా కాప్‌ని కొరికివేయడంతో ఆ బాధతో కాప్‌ విలవిల్లాడిపోయింది. అయితే నిందితురాలు తనపై మోపబడ్డ అభియోగాల్ని ఖండిస్తోంది. ఫిబ్రవరి 5వ తేదీన నైఫ్‌ ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. నిందితురాలి వాదనలు ఎలా వున్నా, గాయపడ్డ మహిళా కాప్‌కి వైద్య చికిత్స అందించిన ఆసుపత్రి వర్గాలు, దాడి కారణంగా ఆమెకు గాయాలు కలిగాయని ధృవీకరించడం జరిగింది. ఈ కేసు తదుపరి విచారణ, తీర్పు ఏప్రిల్‌ 29కి వాయిదా పడ్డాయి. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com