అథ్లెట్‌పై చెఫ్ అసభ్యకర ప్రవర్తన..బాధ్యతల నుండి సస్పెండ్
- April 04, 2018
గోల్డ్‌కోస్ట్ : కామన్‌వెల్త్ క్రీడలలో అథ్లెట్‌పై అసభ్యకరంగా ప్రవర్తించిన మారిషస్ చెఫ్‌ను బాధ్యతల నుండి తొలగించారు. మారిషస్ చెఫ్ తన పట్ల అసభ్యకరంగా ప్రవర్తించాడని ఒక అథ్లెట్ ఫిర్యాదు చేశారు. దీంతో అతనిపై కేసు నమోదు చేసినట్లు ఆస్ట్రేలియా పోలీసులు తెలిపారు. కామన్‌వెల్త్ క్రీడల ప్రారంభ కార్యక్రమానికి ముందే ఈ ఘటన జరిగినట్లు అథ్లెట్ ఫిర్యాదులో పేర్కొన్నారని, ప్రస్తుతం విచారణ జరుపుతున్నామని క్వీన్స్‌లాండ్ డిసిపి పేర్కొన్నారు. ఈ ఘటనపై స్పందించిన గేమ్స్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ డేవిడ్ గ్రీమ్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. సుమారు 6600 మంది క్రీడాకారులు గోల్డ్‌కోస్ట్‌కు చేరుకున్నారని, వారి రక్షణ పట్ల బాధ్యతగా వ్యవహరిస్తామని, ఇలాంటి సంఘటనల్ని తాము సహించబోమని ఆయన స్పష్టం చేశారు.
తాజా వార్తలు
- ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ముఖ్య గమనిక..
- WPL 2026 రిటెన్షన్ లిస్ట్ ఇదే..
- టీ20 ప్రపంచకప్ ఫైనల్‌కు వేదిక ఖరారు..!
- తెలంగాణలో కొత్తగా మూడు టీటీడీ దేవాలయాలు: టీటీడీ ఛైర్మన్
- స్పీడ్‌మాక్స్ సైకిళ్లను కొనవద్దు..CPA హెచ్చరిక..!!
- దుబాయ్ లో త్వరలో కొత్త వాటర్‌పార్క్..!!
- బహ్రెయిన్ లో ముగిసిన కొత్త సీజన్ కు రిజిస్ట్రేషన్లు..!!
- కువైట్ లో 28 ఏళ్ల తర్వాత కేరళ సీం విజయన్..!!
- మదీనాలో ఇద్దరు మహిళలు సహా ముగ్గురు అరెస్ట్..!!
- ఖతార్ లో సీజనల్ వెజిటేబుల్ మార్కెట్లు ప్రారంభం..!!







