ఒకరి ప్రాణాన్ని బలిగొన్న చీమ
- April 04, 2018
సౌదీ అరేబియా: చీమకుట్టి మహిళ చనిపోయిన ఘటన సౌదీ అరేబియాలో చోటుచేసుకుంది. విషపూరితమైన చీమ కుట్టడం వల్ల సౌదీ అరేబియాలో ఓ మహిళ మృతి చెందింది. నమ్మశక్యంగా లేకున్నా ఇది నిజం. ప్రాణాలు కోల్పోయింది మన దేశంలోని కేరళ రాష్ట్రానకి చెందిన మహిళే. కేరళకు చెందిన సూసీ జెఫ్పీ అనే 36ఏళ్ల మహిళ కొంతకాలంగా సౌదీలో ఉంటున్నారు. ఆమె కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. మార్చి 19న ఆమె ఇంట్లో ఉండగా ఏదో కుట్టినట్లు అనిపించందని తన భర్త జెఫ్పీ మాథ్యూకు చెప్పింది.
చుట్టుపక్కన చీమను గుర్తించిన మాథ్యూ దాన్ని అక్కడి నుంచి తీసి బయట పడేశారు. వెంటనే ఆమె శరీరం వాపు రావడం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు తలెత్తడంతో ఆసుపత్రికి తరలించారు. శరీరంపై అలర్జీ ఎక్కువ కావడంతో ఐసీయూలో ఉంచి ప్రత్యేక చికిత్సను అందించారు. తీవ్రంగా కృషి చేసిన వైద్యులు ఆమె ప్రాణాలు కాపాడలేకపోయారు. ఐతే ఆమె మృతికి గల కారణాలు తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నామని డాక్టర్లు చెబుతున్నారు.
తాజా వార్తలు
- RBVRR పోలీస్ అకాడమీలో ప్రొబేషనరీ డిప్యూటీ సూపరింటెండెంట్స్ శిక్షణ ప్రారంభం
- 80వేల వీసాలను రద్దు చేసిన డొనాల్డ్ ట్రంప్
- వర్జీనియా లెఫ్టినెంట్ గవర్నర్గా ఎన్నికైన తొలి భారతీయ ముస్లిం మహిళ
- ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ముఖ్య గమనిక..
- WPL 2026 రిటెన్షన్ లిస్ట్ ఇదే..
- టీ20 ప్రపంచకప్ ఫైనల్కు వేదిక ఖరారు..!
- తెలంగాణలో కొత్తగా మూడు టీటీడీ దేవాలయాలు: టీటీడీ ఛైర్మన్
- స్పీడ్మాక్స్ సైకిళ్లను కొనవద్దు..CPA హెచ్చరిక..!!
- దుబాయ్ లో త్వరలో కొత్త వాటర్పార్క్..!!
- బహ్రెయిన్ లో ముగిసిన కొత్త సీజన్ కు రిజిస్ట్రేషన్లు..!!







