యూఏఈ 44వ జాతీయ దినోత్సవ సందడి!
- December 02, 2015
యూఏఈ 44వ జాతీయ దినోత్సవం సందర్భంగా, ప్రెసిడెంట్ షేక్ ఖలీఫా బిన్ జాయెద్ అల్ నహ్యాన్ ప్రజలకు పిలుపునిస్తూ, జాతీయ ఆర్థిక, విద్య, సామాజిక కార్యక్రమానికి సంబంధించిన 10 పాయింట్లపై ప్రచారం కల్పించేందుకు ర్యాలీలు తీయాలని కోరారు. అలాగే, దేశం కోసం ప్రాణాలకు ఒడ్డి పోరాడిన అమరవీరుల్ని స్మరించుకున్నారు. అమరవీరుల త్యాగాల్ని ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలని పిలుపునిచ్చారు షేక్ ఖలీఫా. ప్రైమ్ మినిస్టర్, వైస్ ప్రెసిడెంట్ షేక్ మహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తౌమ్ మాట్లాడుతూ, అభివృద్ధిలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని అన్నారు. ఇతరుల పట్ల దయాగుణంతో ఉండాలనీ, అలాగే దేశం కోసం పోరాడాల్సి వస్తే ప్రతి ఒక్కరూ సిద్ధంగా ఉండాలని చెప్పారు. అబుదాబీ క్రౌన్ ప్రిన్స్, యూఏఈ ఆర్మ్డ్ ఫోర్సెస్ డిప్యూటీ కమాండర్షేక్ మహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ మాట్లాడుతూ, దేశానికి యువశక్తి కీలకమనీ, దేశ అభివృద్ధిలో యువతదే అగ్ర తాంబూలమనీ అన్నారు. సవాళ్ళను ఎదుర్కొన్నప్పుడే యువతలో దాగి ఉన్న శక్తి బయటకు వస్తుందని ఆయన చెప్పారు.
తాజా వార్తలు
- DIMDEX 2026 ను ప్రారంభించిన అమీర్..!!
- పవిత్ర రమదాన్ మాసం ఫిబ్రవరి 19న ప్రారంభం..!!
- బహ్రెయిన్ లో లగ్జరీ వాచీల స్కామ్..ఇద్దరికి జైలుశిక్ష, ఫైన్..!!
- కొత్త అల్-జౌఫ్ అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభం..!!
- కువైట్లో ఇండియా AI ఇంపాక్ట్ సమ్మిట్ 2026 సన్నాహక సమావేశం..!!
- భారత్, యూఏఈ మధ్య కుదిరిన కీలక ఒప్పందాలు..!!
- యూఏఈ అధ్యక్షుడికి అదిరిపోయే గిఫ్టులు ఇచ్చిన భారత ప్రధాని..!!
- ఉచితంగా చంద్రుడి పైకి ప్రయాణం చేసే అవకాశం
- ఇక OTPలు అవసరం లేదా?
- కాబూల్లో భారీ పేలుడు.. ఏడుగురు మృతి







