సల్మాన్‌ఖాన్ ను దోషిగా తేల్చిన కోర్టు
- April 04, 2018
ముంబై: కృష్ణ జింకల వేట కేసులో బాలీవుడ్ హీరో సల్మాన్‌ఖాన్‌ను జోథ్‌పూర్ కోర్టు దోషిగా తేల్చింది. మిగతా ఐదుగురు నటులను నిర్దోషులుగా ప్రకటించింది. ఈ కేసుకు సంబంధించి మార్చి 28నాటికి తుది వాదనలు పూర్తయ్యాయి. అయితే చీఫ్ జుడీషియల్ మేజిస్ట్రేట్ దేవ్‌కుమార్ కత్రి తీర్పును వాయిదా వేశారు. ఈరోజు కేసు విచారణకు రాగా సల్మాన్‌ఖాన్‌ను కోర్టు దోషిగా తేల్చింది.
1998 అక్టోబర్‌లో జరిగిన ఓ షూటింగ్ సందర్భంగా జోథ్‌పూర్ సమీపంలోని కంకణి గ్రామంలో కృష్ణజింకలను హతమార్చినట్లు సల్మాన్‌పై కేసు నమోదు అయ్యింది. ఇందులో సల్మాన్ ఖాన్‌పై వన్యప్రాణి సంరక్షణ చట్టం సెక్షన్ 51కింద కేసు నమోదు చేశారు. ఇతర నటులపై సెక్షన్ 149కింద కేసు నమోదు అయ్యింది. ఈ కేసులో తీర్పు వెల్లడించిన కోర్టు సల్మాన్‌ను దోషిగా తేల్చుతూ.. మిగతా ఐదుగురు నటులను నిర్దోషులుగా ప్రకటిస్తూ తీర్పునిచ్చింది. జింకల వేట కేసులో ఈరోజు తీర్పు సందర్భంగా సల్మాన్‌ఖాన్‌తో పాటు సైఫ్ అలీఖాన్, టబూ, సొనాలిబింద్రే, నీలం తదితరులు జోథ్‌పూర్ కోర్టుకు చేరుకున్నారు.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..