ఒక్క అవకాశమివ్వండి: జుకర్‌బర్గ్
- April 04, 2018
వాషింగ్టన్: తనకు మరో అవకాశమివ్వాలని ఫేస్‌బుక్ వ్యవస్థాపకుడు మార్క్ జుకర్‌బర్గ్ కోరారు. ఫేస్‌బుక్ వినియోగదారుల సమాచారాన్ని లండన్‌కు చెందిన కేంబ్రిడ్జ్ ఎనలిటికా సంస్థ అక్రమంగా ఉపయోగించుకోవడంపై వివాదం తలెత్తిన సంగతి తెలిసిందే. ఇప్పటికే క్షమాపణలు చెప్పిన ఆయన బుధవారం విలేకరుల సమావేశంలో మరోసారి క్షమాపణలు తెలిపారు. కంపెనీని నడిపించడానికి మీరే సరైన వ్యక్తి అనుకుంటున్నారా? అని విలేకరులు అడిగిన ప్రశ్నకు సమాధానంగా ఆయన తనకు మరో అవకాశమివ్వాల్సిందిగా కోరారు. చాలా పెద్ద పొరపాటు జరిగిందని, దీనికి తానే భాద్యుడనని అన్నారు. ఎవరైనా సరే తప్పులు చేస్తారని, అయితే వాటి నుంచి గుణపాఠం నేర్చుకుంటారని ఆయన పేర్కొన్నారు. ఈ ఘటన వల్ల కంపెనీ నుంచి ఎవరినీ తొలగించలేదని జుకర్‌బర్గ్ వెల్లడించారు.
తాజా వార్తలు
- ఏపీ భక్తులకు గుడ్ న్యూస్.. దేవీ నవరాత్రులకు ఉచిత విద్యుత్: మంత్రి లోకేష్
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు కీలక సమావేశం
- ఉక్రెయిన్‌లో బస్సుల పై దాడి.. 33 మంది దుర్మరణం
- UAE Pavilion draws strong visitor turnout on opening day of Marrakech Airshow 2026
- విమాన ప్రయాణికులకు మరో షాక్.. ఛార్జీలు పెంచిన ఎయిరిండియా
- సంగీతం మరియు నృత్యం ద్వారాకంటి వెలుగు
- అమెజాన్‌లో మరోసారి ఉద్యోగ కోతలు
- ఆటిజం పై అపోహలు వీడాలి: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- సౌదీలో ఉద్రిక్తతలు.. రియాద్‌కు ఇండిగో, ఎయిరిండియా విమాన సర్వీసులు రద్దు
- శ్రీవారి భక్తుల కోసం ‘గరుడ’ యాప్







