యెమెన్‌ బోర్డర్‌లో మిస్సైల్‌ కూల్చివేత

- April 05, 2018 , by Maagulf
యెమెన్‌ బోర్డర్‌లో మిస్సైల్‌ కూల్చివేత

యెమెన్‌లో పోరాడుతున్న సౌదీ నేతృత్వంలోని సంకీర్ణ సేనలు, హౌతీ తీవ్రవాదులు సంధించిన మిస్సైల్‌ని సౌదీ ఎయిర్‌ డిఫెన్స్‌ కూల్చివేసినట్లు పేర్కొన్నాయి. సౌదీ అరామ్‌కో ఆయిల్‌ కంపెనీ లక్ష్యంగా ఈ మిస్సైల్‌ని హౌతీ తీవ్రవాదులు సంధించినట్లు ఓ ప్రకటనలో సౌదీ నేతృత్వంలోని సంకీర్ణ సేనలు ప్రకటించాయి. మిస్సైల్‌ కూల్చివేతతో శకలాలు నివాస ప్రాంతాల్లో పడ్డాయి. అరామ్‌కో సంస్థ, ఈ ఘటనపై స్పందిస్తూ, ఎక్కడా ఎలాంటి ప్రమాదమూ జరగలేదనీ, జిజాన్‌లో అంతా సేఫ్‌గా వుందని పేర్కొంది. హౌతీలు మొత్తంగా 107 మిస్సైల్స్‌నీ, 66,000 ప్రాజెక్టైల్స్‌ని సౌదీ వైపుగా సంధించాయని సౌదీ న్యూస్‌ ఏజెన్సీ పేర్కొంది. ఇరాన్‌, హౌతీ తీవ్రవాదులకు ఈ మిస్సైల్స్‌ని అందిస్తోందని సౌదీ ఆరోపిస్తోంది. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com