యూఏఈలో ప్రియా వారియర్
- April 05, 2018
'ఒరు ఆదార్ లవ్' సినిమా ప్రోమో వీడియోతో ఇంటర్నెట్ సెన్సేషన్‌గా మారిన మలయాళ బ్యూటీ ప్రియా వారియర్, యూఏఈలో ఈ వీకెండ్ సందడి చేయబోతోంది. ప్రియా వారియర్‌తోపాటుగా, 'ఒరు ఆదార్ లవ్' చిత్రంలో నటించిన రోషన్ అబ్దుల్ రహూఫ్, ఈ చిత్ర దర్శకుడు ఒమర్ లులు కూడా యూఏఈలో పర్యటిస్తారు. దుబాయ్, అబుదాబీ, అల్ అయిన్‌లలోని మెడియోర్ హాస్పిటల్స్‌ని వీరు సందర్శిస్తారు. ఈ సందర్భంగా అభిమానుల్ని కలిసేందుకు కూడా ప్రత్యేకమైన ఏర్పాట్లు చేశారు. ఇండియన్ సోషల్ అండ్ కల్చరల్ సెంటర్, 'ఒరు ఆదార్ లవ్' యూనిట్‌తో ముచ్చటించేందుకు అవకాశం కల్పిస్తోంది. ఏప్రిల్ 7న అభిమానులు వీరిని కలవొచ్చు. అభిమానులు ఇప్పటికే తమ అభిమాన తారల్ని చూసేందుకోసం తగిన ఏర్పాట్లలో నిమగ్నమై వున్నారు.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..