రూ.6వేల కోట్లకి టీం ఇండియా క్రికెట్ రైట్స్ అమ్మకం!
- April 05, 2018
ముంబై: టీం ఇండియా ఆడనున్న క్రికెట్ మ్యాచ్లను టెలివిజన్, డిజిటల్ మాద్యమాల్లో ప్రసారం చేసే హక్కులను భారీ మొత్తానికి అమ్ముడుపోయాయి. దీని కోసం తొలిసారిగా బీసీసీఐ ఆన్లైన్లో వేలం నిర్వహించింది. ఈ వేలంలో సోనీ స్పోర్ట్స్, స్టార్ ఇండియా, రిలయన్స్ సంస్థలు పాల్గొన్నాయి. అయితే ఈ వేలంలో ఈ హక్కులను రూ.6,138 కోట్లకు స్టార్ ఇండియా దక్కించుకుంది. 2012 నుంచి 2018 కాలంలో ఈ హక్కులు రూ.3,851 కోట్లకి స్టార్ ఇండియానే కొనుగోలు చేసింది. అయితే 2018 నుంచి 2023 వరకూ ప్రసార హక్కుల కోసం పోటాపోటీగా జరిగిన వేలంలో మరోసారి స్టార్ ఇండియానే ఈ హక్కులు దక్కించుకుంది.ఐదు సంవత్సరాల కాలంలో టీం ఇండియా 104 అంతర్జాతీయ మ్యాచ్లు ఆడనుంది. ఇందులో సీనియర్ల జట్టు మాత్రమే కాకుండా.. మహిళ క్రికెట్ జట్టు ఆడే మ్యాచ్లు కూడా ఉంది. అంటే టీం ఇండియా ఆడే ఒక్కొ మ్యాచ్కి స్టార్ ఇండియా రూ.60.14 కోట్లు వెచ్చింది. 2017లో ఐపీఎల్ ప్రసారం కోసం జరిగిన వేలంలోనూ స్టార్ ఇండియా తన ఆధిపత్యాన్ని కొనసాగించింది. 2018-2022 వరకూ ఐపీఎల్ హక్కులన్ని సోనీ నుంచి స్టార్ ఇండియా దక్కించుకుంది.
తాజా వార్తలు
- సౌదీ లో రియల్ ఎస్టేట్ కంపెనీకి SR3.7 మిలియన్ల జరిమానా..!!
- ఓన నిలవ్ 2025: గ్రాండ్ ఓనం వేడుకలు..!!
- కువైట్లో వందేమాతరం 150వ వార్షికోత్సవ వేడుకలు..!!
- ఫేక్ ఎమిరటైజేషన్ను అరికట్టడానికి యూఏఈలో న్యూ రూల్స్..!!
- ఖతార్ విలువైన భాగస్వామి..గ్లోబల్ ఫండ్ చైర్ పర్సన్ ప్రశంసలు..!!
- జర్మన్ జాతీయుడిని రక్షించిన ఒమన్ ఎయిర్ ఫోర్స్..!!
- తిరుమలలో వైకుంఠ దర్శనం తేదీలు ఖరారు!
- అరుదైన చికిత్స చేసిన మెడికవర్ హాస్పిటల్స్
- హైదరాబాద్లో కొత్త అంతర్జాతీయ స్టేడియం!
- అల్ రుస్తాక్-ఇబ్రి మధ్య వాహనాల వేగ పరిమితి తగ్గింపు..!!







