రష్యా ఎస్‌ 400 ఎయిర్‌ డిఫెన్స్‌ మిసైళ్ల కొనుగోలుకు భారత్‌ చొరవ

- April 06, 2018 , by Maagulf
రష్యా ఎస్‌ 400 ఎయిర్‌ డిఫెన్స్‌ మిసైళ్ల కొనుగోలుకు భారత్‌ చొరవ

న్యూఢిల్లీ : రష్యాతో రక్షణ ఒప్పందాలపై అమెరికా ఆంక్షలు విధించినా ఆ దేశం నుంచి ఎస్‌ 400 ఎయిర్‌ డిఫెన్స్‌ మిసైళ్ల కొనుగోలుకు భారత్‌ చొరవ చూపుతోంది. రూ 30,000 కోట్లతో రష్యా నుంచి క్షిపణి వ్యవస్థను ఆధునీకరించే దిశగా అడుగులు వేస్తోంది. అమెరికా ఆంక్షలు ఈ ఏడాది జనవరి 1 నుంచి అమల్లోకి వచ్చినా రష్యా నుంచి క్షిపణి వ్యవస్థను కొనుగోలు చేయాలనే నిర్ణయంపై భారత్‌ ముందుకెళుతుందని రక్షణ మంత్రిత్వ శాఖ వర్గాలు స్పష్టం చేశాయి.

మరోవైపు అమెరికా ఆంక్షలతో ఒకప్పుడు అగ్రరాజ్యానికి మిత్ర దేశాలైన టర్కీ, ఖతార్‌, సౌదీఅరేబియాలకు ఎస్‌-400 మిసైళ్ల అమ్మకాలపై ప్రతికూల ప్రభావం నెలకొంది. ఇక భారత్‌, చైనాలు మాత్రమే ఎస్‌-400 ఎయిర్‌ మిసైళ్ల కస్టమర్లుగా రష్యా భావిస్తోంది. 350 కిమీ దూరంలోని లక్ష్యాలను ఛేదించగల ఈ మిసైల్స్‌ పలు శ్రేణుల్లో అందుబాటులో ఉంటాయి. మరోవైపు ఎస్‌-400పై రష్యాతో చైనా కూడా ఒప్పందం కుదుర్చుకుంది.

అయితే మేథో సంపత్తి హక్కుల ఉల్లంఘనకు పాల్పడుతూ చైనా రివర్స్‌ ఇంజనీరింగ్‌ ద్వారా వెపన్‌ సిస్టమ్స్‌ను అభివృద్ధి చేసుకుంటుందనే ఆందోళనతో ఈ ఒప్పందంపై రష్యా వెనుకాడుతోంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com