స్పోర్ట్స్‌ కాన్ఫరెన్స్‌కి బహ్రెయిన్‌ సిద్ధం

- April 06, 2018 , by Maagulf
స్పోర్ట్స్‌ కాన్ఫరెన్స్‌కి బహ్రెయిన్‌ సిద్ధం

మనామా: బహ్రెయిన్‌, తొలి అరబ్‌ కాన్ఫరెన్స్‌ (స్పోర్ట్స్‌)కి సంసిద్ధమయ్యింది. వచ్చే వారంలో ఈ ఈవెంట్‌ జరుగుతుంది. ఏప్రిల్‌ 10, 11 తేదీల్లో జరిగే ఈ ఈవెంట్‌ కోసం సర్వం సిద్ధం చేశారు. 'ది రోల్‌ ఆఫ్‌ స్పోర్ట్‌ ఇన్‌ అచీవింగ్‌ ద సస్టెయినబుల్‌ డెవలప్‌మెంట్‌ గోల్స్‌' అనే కాన్సెప్ట్‌పై ఈ ఈవెంట్‌లో ఫోకస్‌ పెడతారు. మినిస్ట్రీ ఆఫ్‌ యూత్‌ మరియు స్పోర్ట్స్‌ ఎఫైర్స్‌ - యునైటెడ్‌ నేషన్స్‌ ఆఫీస్‌ ఇన్‌ బహ్రెయిన్‌, ఇంటర్నేషనల్‌ కౌన్సిల్‌ ఫర్‌ హెల్త్‌, ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌, స్పోర్ట్స్‌ అండ్‌ రిక్రియేషన్‌ నేతృత్వంలో ఈ ఈవెంట్‌ని నిర్వహిస్తున్నారు. బహ్రెయిన్‌ ఈ అత్యున్నత ఈవెంట్‌ని హోస్ట్‌ చేస్తుండడం గర్వంగా వుందని మినిస్టర్‌ ఆఫ్‌ యూత్‌ అండ్‌ స్పోర్ట్స్‌ ఎఫైర్స్‌ హిషామ్‌ బిన్‌ మొహమ్మద్‌ అల్‌ జౌదెర్‌ చెప్పారు. యునైటెడ్‌ నేషన్స్‌ సెట్‌ చేసిన సస్టెయినబుల్‌ డెవలప్‌మెంట్‌ గోల్స్‌ రీచ్‌ అయ్యేందుకు బహ్రెయిన్‌ తనవంతుగా కృషి చేస్తుందని చెప్పారాయన. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com