యూఏఈ:భారత్కు మృతదేహాల తరలింపు ఓ ప్రసహనం
- April 06, 2018
యూఏఈ:యూఏఈలో వలసదారులెవరైనా చనిపోతే, వారిని స్వదేశానికి తరలించడం ఓ ప్రసహనంగా మారిపోతోంది. ఎయిర్స్లైన్స్, మృతదేహాల తరలింపు కోసం డిమాండ్ చేస్తున్న ఛార్జీలు, సామాన్యులను కంటతడిపెట్టిస్తున్నాయి. వివిధ ఎయిర్లైన్స్ 16 దిర్హామ్ల నుంచి 25 దిర్హామ్ల వరకు ఛార్జ్ చేస్తున్నాయి. ఇవి ఒక్కో కిలోగ్రామ్కి చెల్లించాల్సిన ఛార్జీలు. మృతదేహం, అలాగే శవపేటికను కలిపి బరువుని లెక్కిస్తారు. అలా చూస్తే, 2500 దిర్హామ్ల నుంచి 3000 దిర్హామ్ల వరకు మృతదేహం తరలింపుకు ఖర్చవుతోందని ఓ సోషల్ వర్కర్ ఎంఎం నాజర్ కన్హాన్గాడ్ చెప్పారు. భారత రాయబారి నవదీప్ సింగ్ సూరి మాట్లాడుతూ, ఇండియన్ కమ్యూనిటీ వెల్ఫేర్ ఫండ్ ద్వారా ఎంబసీ, ఇలాంటి సందర్భాల్లో తగిన సాయం అందజేస్తోందని చెప్పారు. యూఏఈలో 3.5 మిలియన్ వరకు భారత వలసదారులు ఉన్నారని ఆయన చెప్పారు. ఎయిర్లైన్స్ తమ పాలసీని మార్చుకోవాల్సిందిగా సూచించలేమనీ, చెయ్యగలిగినంతమేర తాము బాధితులకు సహాయం చేయడానికి ప్రయత్నిస్తామని వివరించారాయన. ఈ పరిస్థితిపై ప్రధాని నరేంద్రమోడీతో చర్చించనున్నట్లు బీజేపీ కేరళ అధ్యక్షుడు కుమ్మనం రాజశేఖరన్ ఇటీవల యూఏఈ సందర్శించినప్పుడు చెప్పారు.
తాజా వార్తలు
- RBVRR పోలీస్ అకాడమీలో ప్రొబేషనరీ డిప్యూటీ సూపరింటెండెంట్స్ శిక్షణ ప్రారంభం
- 80వేల వీసాలను రద్దు చేసిన డొనాల్డ్ ట్రంప్
- వర్జీనియా లెఫ్టినెంట్ గవర్నర్గా ఎన్నికైన తొలి భారతీయ ముస్లిం మహిళ
- ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ముఖ్య గమనిక..
- WPL 2026 రిటెన్షన్ లిస్ట్ ఇదే..
- టీ20 ప్రపంచకప్ ఫైనల్కు వేదిక ఖరారు..!
- తెలంగాణలో కొత్తగా మూడు టీటీడీ దేవాలయాలు: టీటీడీ ఛైర్మన్
- స్పీడ్మాక్స్ సైకిళ్లను కొనవద్దు..CPA హెచ్చరిక..!!
- దుబాయ్ లో త్వరలో కొత్త వాటర్పార్క్..!!
- బహ్రెయిన్ లో ముగిసిన కొత్త సీజన్ కు రిజిస్ట్రేషన్లు..!!







