ఎల్పీజీ ట్రక్ యాక్సిడెంట్: గ్యాస్ లీకేజీ
- April 06, 2018
ఎల్పీజీ సిలెండర్లను తీసుకెళుతున్న ట్రక్, బస్‌ని ఢీకొట్టడంతో చెల్లా చెదురుగా పడిపోయిన గ్యాస్ సిలెండర్స్ నుంచి గ్యాస్ లీక్ అయిన ఘటన అజ్మన్‌లోని జార్ఫ్ ప్రాంతంలో చోటు చేసుకుంది. అయితే ఈ ప్రమాదంలో ఎవరూ గాయపడలేదని పోలీసులు చెబుతున్నారు. ప్రమాద ఘటన గురించి సమాచారం అందిన వెంటనే సివిల్ డిఫెన్స్ మరియు అంబులెన్స్ వాహనాలు సంఘటనా స్థలానికి చేరుకున్నాయి. రెస్క్యూ టీమ్, సీరియస్ సిట్యుయేషన్‌ని చాలా చాకచక్యంగా డీల్ చేసింది. లీక్ అయిన సిలెండర్స్‌ని లాక్ చేయగలిగింది. సకాలంలో స్పందించడంతో గ్యాస్ లీకేజీ పేలుడుకు దారి తీయలేదని పోలీసులు పేర్కొన్నారు. ప్రమాద తీవ్రత పెద్దగా లేకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.
తాజా వార్తలు
- RBVRR పోలీస్ అకాడమీలో ప్రొబేషనరీ డిప్యూటీ సూపరింటెండెంట్స్ శిక్షణ ప్రారంభం
- 80వేల వీసాలను రద్దు చేసిన డొనాల్డ్ ట్రంప్
- వర్జీనియా లెఫ్టినెంట్ గవర్నర్గా ఎన్నికైన తొలి భారతీయ ముస్లిం మహిళ
- ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ముఖ్య గమనిక..
- WPL 2026 రిటెన్షన్ లిస్ట్ ఇదే..
- టీ20 ప్రపంచకప్ ఫైనల్కు వేదిక ఖరారు..!
- తెలంగాణలో కొత్తగా మూడు టీటీడీ దేవాలయాలు: టీటీడీ ఛైర్మన్
- స్పీడ్మాక్స్ సైకిళ్లను కొనవద్దు..CPA హెచ్చరిక..!!
- దుబాయ్ లో త్వరలో కొత్త వాటర్పార్క్..!!
- బహ్రెయిన్ లో ముగిసిన కొత్త సీజన్ కు రిజిస్ట్రేషన్లు..!!







