ఇల్లీగల్‌ సిగరెట్‌ స్టోర్‌ మూసివేత

- April 06, 2018 , by Maagulf

మస్కట్‌: నజ్వా మునిసిపాలిటీ, ఓ మెటల్‌ స్క్రాప్‌ షాప్‌ని మూసివేసినట్లు ప్రకటించింది. అక్రమంగా ఇక్కడ సిగరెట్లు విక్రయిస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు. 2,430 ప్యాకెట్ల సిగరెట్లు, కార్టన్లను ఈ సందర్భంగా అధికారులు స్వాధీనం చేసుకున్నారు. షాప్‌ని మూసివేసి, నిర్వాహకులపై క్రిమినల్‌ చర్యలు తీసుకుంటామని అధికారులు వివరించారు. అల్‌ దఖ్లియా మునిసిపల్‌ అధికారులు ఈ మేరకు, లీగల్‌ నోటీసుల్ని కూడా నిర్వాహకులకు పంపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com