మలేసియా:పార్లమెంట్ రద్దు
- April 07, 2018
కౌలాలంపూర్ : మలేసియా పార్లమెంట్‌ను రద్దు చేస్తున్నట్లు ఆ దేశ ప్రధాని నజీబ్ రజక్ శుక్రవారం ప్రకటించారు. తన ఐదేళ్ళ పదవీ కాలం ముగియడానికి రెండు నెలలకు పైగా సమయం వున్నప్పటికీ కొత్తగా సార్వత్రిక ఎన్నికలకు మార్గం సుగమం చేస్తూ నజీబ్ రజక్ ఈ నిర్ణయం తీసుకున్నారు. కోట్లాది డాలర్ల కుంభకోణం కేసు ఎదుర్కొంటున్న నజీబ్, పాలక పార్టీని ఈ ఎన్నికల్లో గెలిపించేందుకు తీవ్రంగా కృషి చేస్తున్నారు. పార్లమెంట్ రద్దుకు రాజు ఆమోద ముద్ర పొందేందుకు గానూ సుల్తాన్ మహ్మద్‌ను కలిసినట్లు నజీబ్ చెప్పారు. శనివారం నుండి రద్దు అమల్లోకి వచ్చేలా చర్యలు తీసుకోవాలని రాజు సిఫార్సుచేసినట్లు నజీబ్ ఒక ప్రత్యేక ప్రకటనలో చెప్పారు. రద్దు చేసిన 60రోజుల్లోగా ఎన్నికలను నిర్వహించాల్సి వుంది.
తాజా వార్తలు
- పేటీఎం నుంచి ట్రావెల్ బుకింగ్ యాప్
- ‘వందే మాతరానికి’ 150 ఏళ్లు
- కువైట్ ఉప ప్రధానమంత్రిని కలిసిన కేరళ సీఎం..!!
- Dh100 మిలియన్ యూఏఈ లాటరీ విజేత ఫ్యూచర్ ప్లాన్ రివీల్..!!
- గ్రేస్ పీరియడ్‌ను సద్వినియోగం చేసుకోవాలని ఒమన్ పిలుపు..!!
- సౌదీయేతరుల ఆస్తులపై కీలక అప్డేట్..!!
- ఖతార్ లో 25.1% పెరిగిన రెంటల్ కాంట్రాక్టులు..!!
- జీసీసీలో బహ్రెయిన్, ఖతార్ తొలి సముద్ర లింక్ ప్రారంభం..!!
- RBVRR పోలీస్ అకాడమీలో ప్రొబేషనరీ డిప్యూటీ సూపరింటెండెంట్స్ శిక్షణ ప్రారంభం
- 80వేల వీసాలను రద్దు చేసిన డొనాల్డ్ ట్రంప్







